For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సెక్స్ కోసం వాడిపారేయాలి' అంటూ కామెంట్..వివాదం..పోలీసు భద్రత

  By Srikanya
  |

  చెన్నై: వివాదాలను ప్రేమించే నటి సోనా తాజాగా మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకుంది. వివాదం ముదిరటంతో దాడులు జరుగుతాయనే భయంతో ఆమె ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. ఆమె ఒక వారపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో పురుషులనుఅవమానించేలా వ్యాఖ్యలు చేశారని పురుషుల భద్రత సంఘ అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్‌ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యల్ని నిరసిస్తూ 19వ తేదీ ఆందోళన చేపట్టనున్నట్టు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు తేనాంపేట కేపీదాసన్‌ వీధిలో ఉన్న సోనా, ఇల్లు, కార్యాలయం, జౌళి దుకాణం, బెసెంట్‌నగర్‌లోని మరో నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు.

  సోనా రీసెంట్ గా ఓ వీక్లీ మ్యాగజైన్ తో మాట్లాడుతూ...మగాళ్ళు టిష్యూ పేపర్స్ వంటివారు. వారిని సెక్స్ కోసం వాడుకుని పారేయాలి. వివాహం అనేది ఫూలిష్ నెస్. చాలా మంది పూలిష్ అమ్మాయిలు వివాహం పేరుతో కలిసి ఉంటున్నారు అంటూ రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసింది. సోనా తీరును హిందూ మక్కల్‌ కట్చి సైతం తప్పుబట్టింది. ఆమె పురుషులను చెత్తకాగితంతో పోల్చి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించింది. సంస్కృతి సంప్రదాయాల్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్న సోనాను అరెస్టు చేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి కుమార్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాలు సైతం ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చారు.

  పురుషులను నొప్పించేలా తానెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని సోమవారం తమిళ పత్రికకు ఇచ్చిన వివరణలో సోనా పేర్కొంది. తాను చెప్పని విషయాల్ని కూడా ఆ పత్రిక ప్రచురించడం దురదృష్టకరమన్నారు. పెళ్లి చేసుకోనని చెప్పడం తన వ్యక్తిగత విషయం మాత్రమేనన్నారు. పురుషులంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. తన స్నేహితుల్లో 99 శాతం పురుషులేనన్నారు. అలాంటి నేను పురుషులను అవమానించేలా ఎలా మాట్లాడగలనని ఆమె ప్రశ్నించారు. తన పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా కొందరు వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

  గతంలోనూ ఆమె ఎస్పీ బాలసుబ్రమణ్యం...కుమారుడు ఎస్పీబి చరణ్ గురించి వివాదం రేపి వార్తల్లోకి ఎక్కారు. తనని ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాడని, నలుగురిలో తనతో అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారానికి ప్రయత్నించాడని ఎస్పీ చరణ్ మీద తీవ్రమైన అభియోగాలు చేసి సోనా చివరకు తన పంతం నెగ్గించుకుంది. మరి ఈ వివాదం ఎక్కడికి చేరుకుంటుందో అంటున్నారు.

  English summary
  Sona somersaults as protests arise for reported comment she made. Actress Sona, in an interview to weekly magazine, commented 'Men are like tissue papers..One should use them for just sex and throw them away'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X