twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ఖాన్‌కు దిష్టిబొమ్మ దహనం

    By Srikanya
    |

    చెన్నై: బాలీవుడ్‌ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనికి కారణం ఆయన నరేంద్రమోడీకి మద్దతు పలకటమే. సల్మాన్‌ వాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇండియా దేశీయ లీగ్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షమా అధ్యక్షతన చేపాక్‌ వద్ద ఆందోళనకు దిగింది. సల్మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి ఆపై విడుదల చేశారు. దీనిపై సల్మాన్ ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.

    ''జైహో' సినిమా ప్రచారం నిమిత్తం గత మంగళవారం అహ్మదాబాద్‌కు వెళ్లిన సల్మాన్‌ఖాన్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో కలిసి సంక్రాంతి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ గుజరాత్‌ను ఎంతగానో అభివృద్ధి చేశారని, కచ్చితంగా ఆయన తన లక్ష్యాన్ని చేరుకుంటారని వ్యాఖ్యానించారు.

    సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24, 2014లో ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీమియర్ షోకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సల్మాన్. జనవరి 23 ముంబైలో ఈ చిత్రం ప్రీమియర్ షో జరుగనుంది.

    ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.

    ఇంతకు ముందు ఇచ్చఒక మంచి సోషల్ మెసేజ్‌తో సాగే 'జై హో' మూవీ విడుదల తర్వాత తన స్టార్ ఇమేజ్ మరింత పెరుగుతుందని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ అక్క పాత్రలో టబు నటిస్తోంది. సునీల్ వెట్టి, సనా ఖాన్, డైసీ షా, నదిరా బబ్బర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Indian Muslim League Party burns Salman’s effigy. ‘Salman a Muslim traitor’ , protests in Chennai organised by Indian Muslim League Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X