twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ ఆపాలని ఆందోళన...53 మంది అరెస్టు

    By Srikanya
    |

    చెన్నై : కార్తి హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కొంబన్‌'. లక్ష్మీమీనన్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ రెండో తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు పలురకాల సమస్యలు వచ్చిపడుతున్నాయి. రామనాథపురంలోని ఓ వర్గానికి వ్యతిరేకంగా ఈ సినిమాను చిత్రీకరించినట్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అంతేకాకుండా పుదియ తమిళగం (పీటీ) పార్టీ అధ్యక్షుడు కృష్ణస్వామి కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా గళమెత్తారు. సినిమాను అడ్డుకోవాలంటూ ఇటీవల సెన్సార్‌బోర్డును కూడా కోరారు. ఇదిలా ఉండగా కృష్ణస్వామి కోసం ఇటీవల ప్రత్యేక ప్రదర్శన కూడా వేసినట్లు సమాచారం. రాష్ట్రంలో జాతి ఘర్షణలకు ఈ సినిమా తావునిస్తుందంటూ సినిమా చూసిన తర్వాత కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కృష్ణస్వామి.

    PT opposes screening of Karthi's new film Komban

    ఈ నేపథ్యంలో సినిమాకు వ్యతిరేకంగా తిరుచ్చిలో పుదియ తమిళగం పార్టీ కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు. సినిమాను విడుదల చేయకూడదని, సమస్యాత్మకమైన అంశాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆందోళనకారులు 53 మందిని పోలీసులు అరెస్టు చేసి ఓ మండపానికి తరలించారు.

    PT opposes screening of Karthi's new film Komban

    'పరుత్తివీరన్ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోకార్తి. తర్వాత చాలా చిత్రాల్లో గ్రామీణ పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా.. ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో ఆయన ఈ తరహా కథాంశంతో తెరకెక్కే 'కొంబన్‌' చిత్రంలో హీరోగా నటించారు. లక్ష్మీ మేనన్‌ హీరోయిన్. ఇందులో రాజ్‌కిరణ్‌ కీలకపాత్ర పోషించారు.

    ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. '' మదురై నేపథ్యంలో సాగే 'పరుత్తివీరన్‌'లో నటించిన తర్వాత అలాంటి అవకాశాలు చాలా వచ్చినా నిరాకరించా. ఆ సినిమాకన్నా గొప్ప సబ్జెక్ట్‌ వస్తే తప్ప నటించకూడదని నిర్ణయించుకున్నా. అప్పుడే ముత్తయ్య 'కొంబన్‌' కథ చెప్పారు. మామ, అల్లుడు మధ్య నడిచే అంశాల ఆధారంగా ఈ కథ అల్లారు. రామనాథపురం జిల్లా నేపథ్యంలో దీన్ని తెరకెక్కించాం. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని గ్రామంలో చిత్రీకరణ సాగింది.

    ఆ గ్రామస్తులు మాకు ఎంతో సహకరించారు. ఇందులో ఏ సినిమా ఛాయలూ కనిపించవని తెలిశాకే.. పలుసార్లు ఆలోచించి నటించేందుకు ఒప్పుకున్నా. తెరపై చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లక్ష్మీ మేనన్‌ గ్రామీణ యువతిగా, నూతన వధువుగా అద్భుతంగా నటించారు. రాజ్‌కిరణ్‌ నాకు మామ పాత్ర పోషించారు. ఆయన నటన సినిమాకు పెద్ద బలం. తమిళనాడు సంప్రదాయాలు, గ్రామీణ అందాలు నిండిన ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కు గుర్తింపు తీసుకొస్తుంద''ని పేర్కొన్నారు.

    PT opposes screening of Karthi's new film Komban

    దర్శకుడు ముత్తయ్య ప్రసంగిస్తూ.. '' నా తొలిచిత్రం 'కుట్టిపులి' తల్లి సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో మామ, అల్లుడు మధ్య బంధం గురించి చెప్పా. నా తదుపరి సినిమాలు కూడా తప్పకుండా బంధుత్వాలు, అనుబంధాల మీదే ఉంటాయి. 'కొంబన్‌' నా ఇంటి కథ. మా తాత, నాన్నల జీవితం ఆధారంగానే దీన్ని రూపొందించాన''ని చెప్పారు. స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు.

    English summary
    The Puthiya Thamizhagam cadres have started agitating against the “unpleasant and provoking remarks” allegedly made against a particular community in the Karthi-starrer ‘Komban.’. Kombam will be directed by Muthaiah of Kutti Puli fame. Lakshmi Menon will play the female lead. Kombam is a rural film set in the backdrop of Ramanathapuram. Yuvan is scoring the music. Velaraj is handling the camera. Editing by Praveen KL. The film is produced by Studio Green.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X