తెలుగులో ధూల్‌పేటగా పూడుపెట్టై
ధనుష్, సోనియా అగర్వాల్, స్నేహ నటించిన తమిళ చిత్రం పూడుపెట్టై తెలుగులో ధూల్‌పేట పేరుతో అనువాదం కానుంది. తమిళంలో భారీ అంచనాలున్న ఈ సినిమా ఇంకా అక్కడ విడుదల కాలేదు. ఈ సినిమాకు 7/జి బృందావన్ కాలనీ ఫేం సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. లక్ష్మీ మూవీ మేకర్స్, మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్ ప్రై.లిమిటెడ్ సంస్ధలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తమిళ ఆడియో ఇటీవల విడుదలై అక్కడ మారుమోగుతోంది. కమల్ హసన్ ఒక పాట పాడడం విశేషం. ఈ సినిమా తెలుగులో మేనెలలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications