For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మర్యాద రామన్న' తమిళ రీమేక్ రిలీజైంది..రిజల్ట్

  By Srikanya
  |

  చెన్నై: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన పంథా మార్చి తీసిన కామెడీ చిత్రం 'మర్యాద రామన్న'. సునీల్‌ ,సలోని కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హాస్య ప్రియులను విశేషంగా అలరించింది. 'మర్యాద రామన్న' తమిళతంబీలను కూడా ఈ శుక్రవారం పలకరించింది. రజనీకాంత్ విక్రమ్ సింహా చిత్రం విడుదల కాకపోవటంతో ఆ థియోటర్స్ లో ఈ చిత్రాన్ని ముందునుకున్న రోజు ని మార్చి ...ఆ రోజు విడుదల చేసేసారు. సంతానం సోలో హీరోగా చేసిన చిత్రం కావటంతో మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్నాయి.

  సంతానం ని హీరోగా అనుకోగానే అతని బలం అయిన స్లాప్ స్టిక్ కామెడీని ఫస్టాఫ్ లో కలిపారు. విట్టీ వన్ లైనర్స్ తో మొత్తం రీరైట్ చేసారు. అయితే సెకండాఫ్ మాత్రం తెలుగునే పూర్తిగా ఫాలో అయ్యారు. అయితే అదే దెబ్బకొట్టింది అంటున్నారు అక్కడ విశ్లేషకులు. చివరి నలభై ఐదు నిముషాల సినిమా మరీ పూర్వ కాలం నాటి సినిమాలా మెలో డ్రామా పాళ్ళు విపరీతమైందని, సంతానం ని అలాంటి సీన్స్ లో ఊహించుకోవటం కష్టమైందని అంటున్నారు. అయితే సంతానం మినిమం గ్యారెంటీ గల కమిడియన్ కావటంతో బాగానే భాక్సాఫీస్ వద్ద కలెక్టు చేస్తుందంటున్నారు. సెకండాఫ్ ని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది అంటున్నారు.

  PVP Cinema tamil remake 'Maryada Rammanna' result

  కోలీవుడ్‌లో 'ఈగ' సాధించిన విజయంతో రాజమౌళికి క్రేజ్‌ పెరిగింది. ఆయన చిత్రాలను దిగుమతి చేసుకునేందుకు ఇక్కడి నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో 'మర్యాద రామన్న' తమిళ హక్కులను పీవీపీ సంస్థ పొందింది. పీవీపీ సంస్థ తమిళంలో 'ఈగ' డబ్బింగ్ వెర్షన్ కి నిర్మాతగా వ్యవహించింది. ఈ నేపధ్యంలో 'మర్యాద రామన్న' తమిళ రీమేక్ కు సైతం మంచి క్రేజ్ వచ్చింది. దానికి తగినట్లే సంతాకంకు తమిళంలో స్టార్ కమిడియన్ గా పేరు ఉండటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.

  మరో ప్రక్క 'మర్యాద రామన్న'హిందీ వెర్షన్ 'సన్నాఫ్ సర్దార్' విడుదల అయ్యి ఫ్లాఫ్ అయ్యింది. అజయ్‌దేవగన్, సొనాక్షిసిన్హా, సంజయ్‌దత్, జుహీచావ్లా తదితరుల కాంబినేషన్‌లో రూపొందినా ఫలితం లేకుండా పోయింది. అజయ్‌దేవగన్ మాస్ హీరో కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, హిందీ నేటివిటీకి అనుగుణంగా కథలో కొంత మసాలా జోడించి తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్ ధీర్. అలాగే ఈ చిత్రం పంజాబ్ పాటియాలా నేపద్యంలో జరుగింది. ప్రత్యేకమైన ఇంటిసెట్ వేసి భారీగా ఈ చిత్రాన్ని షూట్ చేసారు. అయినా ఫలితం లేదు.

  మర్యాద రామన్న చిత్రం కన్నడంలో రీమేకై ఆ మధ్యన విడుదలైంది. అయితే అక్కడ పెద్దగా ఆడలేదు. కోమల్ అనే ఆర్టిస్టు కన్నడ మర్యాద రామన్న లో సునీల్ పాత్రను చేసాడు. కీరవాణి సంగీతం అందించాడు. తెలుగు ఉన్నదున్నట్లుగా అనువదించారు. ఉపేంద్ర అక్కడ సైకిల్ వాయిస్ కి డబ్బింగ్ ఇచ్చారు. తెలుగులో రవితేజ చెప్పినట్లుగా చేసాడు. ముకేష్ రుషి..ఇక్కడ తెలుగులో నాగినీడు పాత్రను చేసాడు. నిషా అక్కడ హీరోయిన్ గా సలోని పాత్రను చేసింది.

  English summary
  After the roaring success of ‘Kanna Laddu Thinna Aasaiyaa’, Santhanam has once again turned hero with ‘Vallavanukku Pullum Aayudham’. There are few brainy moments in the second half showcasing how Santhanam evades the danger, but, sadly it is followed by a long melodramatic climax. It is too hard to take in at a time, when we are witnessing open-ended climaxes these days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X