For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జయలలితగా రమ్యకృష్ణ ట్రెండ్ సెట్ చేయనుందా..? 'క్వీన్' ఫస్ట్‌లుక్ చూస్తుంటే!

|

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. మరోవైపు బయోపిక్ సినిమాలంటే మక్కువ చూపుతున్నారు ప్రేక్షకులు. సరిగ్గా ఈ తరుణంలో ఈ రెండింటి కలయికతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. దివంగత నటి, రాజకీయ వేత్త జయలలిత జీవిత కథ ఆధారంగా 'క్వీన్' అనే వెబ్ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది.

తాజాగా ఈ 'క్వీన్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్. రమ్యకృష్ణ పేస్ కనిపించకుండా ఈ పోస్టర్‌లో ఆమెను వెనుక నుంచి చూపించారు. జయలలిత ప్రజలనుద్దేశించి ఓ సభలో మాట్లాడుతున్నట్లుగా ఉందీ స్టిల్. అన్నాడీఎంకే పార్టీ చిహ్నాన్ని గుర్తు చేస్తూ మూడు రంగుల బోర్డర్‌తో ఉన్న తెల్ల చీరను రమ్యకృష్ణ ధరించడం విశేషం. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసి వెబ్ సిరీస్ రూపంలో జయలలితగా రమ్యకృష్ణ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయం అని చెప్పుకుంటున్నారు జనం.

Queen First Look: Ramya Krishnan as Jayalalithaa

ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎక్స్ ప్లేయర్ సౌజన్యంతో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఎంఎక్స్ ప్లేయర్‌లో ఈ బయో వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.

English summary
The first look of upcoming web series Queen, based on the life of Jayalalithaa, was unveiled on Saturday and The poster features actor Ramya Krishnan posing as Jayalalithaa from her heyday
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more