Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జయలలితగా రమ్యకృష్ణ ట్రెండ్ సెట్ చేయనుందా..? 'క్వీన్' ఫస్ట్‌లుక్ చూస్తుంటే!
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. మరోవైపు బయోపిక్ సినిమాలంటే మక్కువ చూపుతున్నారు ప్రేక్షకులు. సరిగ్గా ఈ తరుణంలో ఈ రెండింటి కలయికతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. దివంగత నటి, రాజకీయ వేత్త జయలలిత జీవిత కథ ఆధారంగా 'క్వీన్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది.
తాజాగా ఈ 'క్వీన్' ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. రమ్యకృష్ణ పేస్ కనిపించకుండా ఈ పోస్టర్లో ఆమెను వెనుక నుంచి చూపించారు. జయలలిత ప్రజలనుద్దేశించి ఓ సభలో మాట్లాడుతున్నట్లుగా ఉందీ స్టిల్. అన్నాడీఎంకే పార్టీ చిహ్నాన్ని గుర్తు చేస్తూ మూడు రంగుల బోర్డర్‌తో ఉన్న తెల్ల చీరను రమ్యకృష్ణ ధరించడం విశేషం. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసి వెబ్ సిరీస్ రూపంలో జయలలితగా రమ్యకృష్ణ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయం అని చెప్పుకుంటున్నారు జనం.
ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎక్స్ ప్లేయర్ సౌజన్యంతో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఎంఎక్స్ ప్లేయర్లో ఈ బయో వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.