క్యూట్ బేబీస్ నిన్న శత్రువులు...నేడు స్నేహితులు...!?
జెనీలియా, హన్సికా ఇద్దరూ ఇప్పుడు ఎవరికీ అర్ధం కావడం లేదు. నిన్నటి దాకా ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుండేది... అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ ఒకర్నొకరు తెగ పొగిడేసుకుంటున్నారు. దాంతో వీళ్ల వ్యవహారం తమిళ మీడియా వాళ్లకి అస్సలు అర్ధం కావడం లేదట. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి 'వేలాయుధం' అనే తమిళ సినిమాలో నటించిన సంగతి మనకు తెలుసు కదా. ఆ సినిమా షూటింగులో ఇద్దరూ తెగ దెబ్బలాడుకున్నారనీ, కొన్నిసార్లు కొట్టుకునేదాకా కూడా పరిస్థితి వెళ్ళిందనీ వార్తలొచ్చాయి. అలాంటి ఇద్దరూ ఇప్పుడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకర్నొకరు ఆకాశానికి ఎత్తేసుకుంటున్నారు.
'పైకి సున్నితంగా కనిపించే హన్సిక కెమెరా ముందుకు వెళ్లగానే చెలరేగిపోతుంది. అంత ఎనర్జీ ఆమెకు ఎలా వస్తుందో నాకు తెలియడం లేదు' అంటూ జెన్నీ పొగుడుతుంటే, అందుకు బదులుగా, 'జెన్నీలో కనిపించే ఆ క్యూట్ నెస్ అంటే నాకెంతో ఇష్టం. తను తెరపై చేసే చిలిపి పనులు సూపర్బ్. అలాంటి చేష్టలు మరెవరు చేసినా అసహ్యంగా వుంటుంది. ఆ క్యూట్ నెస్ జెన్నీకే చెల్లింది' అంటూ హన్సిక డబ్బా కొడుతోంది. ఇలా ఒక్కసారిగా వీళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా నటించేస్తుంటే అందరూ వెర్రిమొహాలేస్తున్నారు..


Click it and Unblock the Notifications











