twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెనడా స్పీకర్ చైర్లో మన హీరో: సినిమా షూటింగ్ కాదు నిజమే

    హీరో ఆర్. మాధవన్ కెనడా పార్లమెంట్‌కి వెళ్లారు. స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు.. ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఇది ఏదో సినిమాలోనో.. లేదంటే సినిమా కోసం వేసిన సెట్‌లోనో అనుకుంటే తప్పులో కాలేసినట్టే.

    |

    ఎప్పుడైనా మన పార్లమెంట్ లోకి వెళ్లారా? ఒక వేళ వెళ్తే గనక జస్ట్ మనని చూడటానికి అనుమతిస్తారేమో గానీ అక్కడ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కూర్చునే సమావేశమందిరం లోకి అనుమతి ఉందదు... ఉన్నా ఆ కుర్చీల్లో మనం కూర్చోకూడదు... అయితే కొన్ని దేశాల్లో చట్టాలు మరీ ఇంత స్ట్రిక్ట్ గా ఉండవు. ఒక హోదాలో ఉన్న వ్యక్తులకు అక్కడ వాళ్ళు ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది.

    స్పీకర్ కూడా మిమ్మల్ని గౌరవంగా లోపలికి తీసుకు వెళ్ళిమరీ మొత్తం హాల్ చూపిస్తారు, అయితే మామూలు టూరిస్టులకి అంత సీన్ ఉండదు కనీస సెలబ్రిటీ హోదా ఉండాలి... అదే ఇప్పుడు ఆర్. మాధవన్ కి ఎదురైన అనుభవం... మన హీరో కెనడా పార్లమెంట్‌కి వెళ్లారు. స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు.. ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఇది ఏదో సినిమాలోనో.. లేదంటే సినిమా కోసం వేసిన సెట్‌లోనో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. నిజంగా జరిగింది. ప్రస్తుతం ఆయన కెనడా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అక్కడి పార్లమెంటును సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన్ను పార్లమెంటు సభ్యులు చాలా గౌరవించారు.

    R Madhavan visits Canadian parliament

    ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆయన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. "కెనెడియన్ పార్లమెంట్ హౌస్.. ఒట్టావాలోని స్పీకర్ చైర్‌పై.. నన్ను ఇంతగా గౌరవించింనందుకు ధన్యవాదాలు సార్" అంటూ ట్వీట్ చేశారు మాధవన్. ప్రస్తుతం ఆయన నటించిన విక్రమ్ వేద సినిమా మంచి హిట్ సాధించింది. ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో 'సవ్యసాచి' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

    English summary
    Actor R. Madhavan got a chance to visit the Canadian parliament and thanked politician Gary Anandasangaree for the honour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X