Just In
- 5 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 5 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 6 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 7 hrs ago
బ్లాక్లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంత ద్వేషంమా ? విశాల్, హీరో కార్తీ లపై సీనియర్ నటి రాధిక ఫైర్
చెన్నై : నడిగర సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) నుంచి తమిళ సీనియర్ నటుడు, మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్ లను సస్పెండ్ చేస్తున్నట్టు సంస్థ నిన్న ప్రకటించిన సంగతితెలిసిందే. సంఘం నుంచి తన భర్త శరతకుమార్‌ని తొలగించడంపై రాధిక తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా హీరో విశాల్, కార్తిల పై విమర్శలు కురిపించారు.
నడిగర్ సంఘంకు చెందిన రూ1.65 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ శరతకుమార్, రాధారవిలను తొలగించి, వారిపై పోలీసు కేసు పెట్టేందుకు ఇటీవలే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాధిక మంగళవారం ట్విట్టర్‌లో స్పందించారు.
'మొదట 100 కోట్లు అన్నారు. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారా? అయినా ఆరోపణలు ఉన్నప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తొలగించడం కరెక్టేనా? నీలో ఇంత ద్వేషం ఉందా? ఇలా అడినందుకు నన్ను కూడా సస్పెండ్ చేయండి' అని రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నడిగర సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యనిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపిన కార్యవర్గ సభ్యులు, తాము నిర్వహించిన శోధనల్లో గత కార్యవర్గం చేసిన అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని, దీంతో పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ప్రకటన విడుదల చేసింది.
తనిఖీల్లో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఈ ముగ్గురి ప్రాధమిక సభ్యత్వాలను రద్దు చేసినట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరి అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం చర్యలు ఉంటాయని వారు తెలిపారు.

ఇక కొంతకాలం క్రితం జరిగిన తమిళ సినీ నటుల సమాఖ్య 'నడిగర్ సంఘం' ఎన్నికలు ప్రభావమే ఇదంతా అని చెప్పాలి. ఆ ఎన్నికలు..ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ముందు హోరా హోరీ విమర్శలతో ఎన్నికల వేడి రాజకీయవాతావరణాన్ని తలపించింది. ఒకానొక సమయంలో ఇరు వర్గాలు వ్యక్తిగత విమర్శలు... కుక్క, నక్క అంటూ నిందించుకోవడం చూసి సినీ ప్రేక్షకులు సైతం నివ్వెర పోయారు.
ఎన్నికల్లో శతర్ కుమార్ జట్టు..... నాజర్-విశాల్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఓటమి అనంతరం నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడిగా మారిపోయిన శరత్ కుమార్ మాట్లాుతూ...ఎన్నికల సందర్భంగా విశాల్ జట్టు తనపై చేసిన ఆరోపణలు, అవినీతి నిందలు తన మనసుని తీవ్రంగా గాయపరిచాయని, తాను పరిశుద్ధుడిని మీడియా ముఖంగా ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా 15 ఏళ్లు నడిగర్ సంఘం అభివృద్ధి కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డానని, 33 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఏనాడూ తప్పు చేయలేదని, నడిగర్ సంఘం వ్యవహారంలోనూ ఎ లాంటి తప్పు జరగలేదని స్పష్టం చేసారు.