For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంత ద్వేషంమా ? విశాల్‌, హీరో కార్తీ లపై సీనియర్‌ నటి రాధిక ఫైర్

  By Srikanya
  |

  చెన్నై : నడిగర సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) నుంచి తమిళ సీనియర్ నటుడు, మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్ లను సస్పెండ్ చేస్తున్నట్టు సంస్థ నిన్న ప్రకటించిన సంగతితెలిసిందే. సంఘం నుంచి తన భర్త శరతకుమార్‌ని తొలగించడంపై రాధిక తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ వేదికగా హీరో విశాల్‌, కార్తిల పై విమర్శలు కురిపించారు.

  నడిగర్‌ సంఘంకు చెందిన రూ1.65 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ శరతకుమార్‌, రాధారవిలను తొలగించి, వారిపై పోలీసు కేసు పెట్టేందుకు ఇటీవలే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాధిక మంగళవారం ట్విట్టర్‌లో స్పందించారు.

  'మొదట 100 కోట్లు అన్నారు. ఇప్పుడు డిస్కౌంట్‌ ఇచ్చారా? అయినా ఆరోపణలు ఉన్నప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తొలగించడం కరెక్టేనా? నీలో ఇంత ద్వేషం ఉందా? ఇలా అడినందుకు నన్ను కూడా సస్పెండ్‌ చేయండి' అని రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  నడిగర సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యనిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపిన కార్యవర్గ సభ్యులు, తాము నిర్వహించిన శోధనల్లో గత కార్యవర్గం చేసిన అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని, దీంతో పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ప్రకటన విడుదల చేసింది.

  తనిఖీల్లో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఈ ముగ్గురి ప్రాధమిక సభ్యత్వాలను రద్దు చేసినట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరి అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం చర్యలు ఉంటాయని వారు తెలిపారు.

  Raadika Lashes Out At Vishal & Karthi For Suspending Sarathkumar

  ఇక కొంతకాలం క్రితం జరిగిన తమిళ సినీ నటుల సమాఖ్య 'నడిగర్ సంఘం' ఎన్నికలు ప్రభావమే ఇదంతా అని చెప్పాలి. ఆ ఎన్నికలు..ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల ముందు హోరా హోరీ విమర్శలతో ఎన్నికల వేడి రాజకీయవాతావరణాన్ని తలపించింది. ఒకానొక సమయంలో ఇరు వర్గాలు వ్యక్తిగత విమర్శలు... కుక్క, నక్క అంటూ నిందించుకోవడం చూసి సినీ ప్రేక్షకులు సైతం నివ్వెర పోయారు.

  ఎన్నికల్లో శతర్ కుమార్ జట్టు..... నాజర్-విశాల్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఓటమి అనంతరం నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడిగా మారిపోయిన శరత్ కుమార్ మాట్లాుతూ...ఎన్నికల సందర్భంగా విశాల్ జట్టు తనపై చేసిన ఆరోపణలు, అవినీతి నిందలు తన మనసుని తీవ్రంగా గాయపరిచాయని, తాను పరిశుద్ధుడిని మీడియా ముఖంగా ప్రకటించారు.

  ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా 15 ఏళ్లు నడిగర్‌ సంఘం అభివృద్ధి కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డానని, 33 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను ఏనాడూ తప్పు చేయలేదని, నడిగర్‌ సంఘం వ్యవహారంలోనూ ఎ లాంటి తప్పు జరగలేదని స్పష్టం చేసారు.

  English summary
  After Nadigar Sangam suspended Sarathkumar along with Radha Ravi and Vagai Chandrasekhar for not producing the accounts maintained during their 10 year tenure, Raadika has lashed out at Vishal, the current Secretary and Karthi (Treasurer) through a series of tweets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X