నన్ను బికినిలో చూడడం ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండి.. లవ్ ఎఫైర్స్ లెక్కలేనన్ని!
హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. చిత్ర ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. రాయ్ లక్ష్మిపై రూమర్స్ కూడా చాలా వినిపిస్తూంటాయి. రాయ్ లక్ష్మి ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. రాయ్ లక్ష్మి, కేథరిన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న నీయా 2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాయ్ లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

15 కిలోలు తగ్గా
గతంలో బొద్దుగా కనిపించే రాయ్ లక్ష్మి ఇటీవల కాస్త సన్నబడి కనిపిస్తోంది. బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ కొందరు బరువు తగ్గితే చూడలేని విధంగా తయారవుతారు. కానీ నేను బరువు తగ్గాక చాలా బావున్నానని అంటున్నారు. నీయా 2లో మరింత స్లిమ్ గా కనిపిస్తా. ఇటీవల తానూ 15 కిలోల బరువు తగ్గానని రాయ్ లక్ష్మి పేర్కొంది. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా.వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓకె చేయను. ఎందుకంటే మంచి అవకాశం రాకపోతే ఖాళీగా ఉండడమే మంచిది అని రాయ్ లక్ష్మి తెలిపింది.

ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండి
ఇటీవల రాయ్ లక్ష్మి బికినిలో అందాలు ఆరబోస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దీని గురించి ప్రశ్నించగా.. ఎక్కడకు వెళ్లినా జ్ఞాపకాల కోసం సెల్ఫీలు తీసుకుంటా. ఇటీవల ఎక్కువగా ముంబైలో ఉన్నా. అక్కడ బికిని ధరించడం చాలా కామన్. ఆ ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినిలో చూడడం ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండి అంటూ రాయ్ లక్ష్మి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

లవ్ ఎఫైర్స్
ఇటీవల రాయ్ లక్ష్మి ప్రేమ వ్యవహారాల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఏం జరిగిందో నేను దాచిపెట్టను. అలాగని పబ్లిక్ గా చెప్పుకోను. నేను చాలా మందితో రిలేషన్స్ లో ఉన్న మాట వాస్తవం అని రాయ్ లక్ష్మి పేర్కొంది. వాటన్నింటికి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవల తాను గర్భవతిని అంటూ వచ్చిన వార్తలపై కూడా రాయ్ లక్ష్మి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.

నేనే సెలెక్ట్ చేసుకుంటా
వివాహం గురించి మాట్లాడుతూ నా కు కాబోయే భర్తని నేనే ఎంపిక చేసుకుంటా. నా కుటుంబ సభ్యులు ఆ స్వేచ్చని ఇచ్చారు. సరైన వ్యక్తి ఎదురైనప్పుడు పెళ్లి గురించి చెబుతా అని రాయ్ లక్ష్మి తెలిపింది. రాయ్ లక్ష్మి తెలుగులో నటించిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రం ఇటీవల విడుదలైంది.


Click it and Unblock the Notifications











