twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్ధరాత్రి అదిరింది.. నీతో సాయంత్రం.. ప్రముఖ గాయకుడితో రాయ్ లక్ష్మీ!

    |

    దక్షిణాది సినీ తార రాయ్ లక్ష్మీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికా పాప్ సింగ్ అకాన్‌ను కలుసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో 2017లో అకాన్‌ను రాయ్ లక్ష్మీ కలుసుకొన్న విషయం తెలిసిందే. అకాన్‌తో కలిసిన ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా దానికి భారీగా రెస్పాన్స్ లభించింది.

    అర్ధరాత్రి పార్టీలో అకాన్‌తో

    అర్ధరాత్రి పార్టీలో అకాన్‌తో

    అమెరికాలో పాపులర్ సింగర్ అకాన్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. కొద్దికాలంగా పలు ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అకాన్ బిజీ షెడ్యూల్‌‌ను పక్కన పెట్టి రాయ్ లక్ష్మీతో కొంత సమయాన్ని గడపడం క్రేజీగా మారింది. అకాన్‌ను కలుసుకొన్న ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

    అకాన్‌ కలిసి చెట్టాపట్టాల్

    అకాన్‌ కలిసి చెట్టాపట్టాల్

    పాపులర్ సింగర్ అకాన్‌ను కలిసిన సంతోషం రాయ్ లక్ష్మీ ముఖంలో కనిపించింది. అకాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చింది. అకాన్ వైట్ షర్టు వేసుకోగా, రాయ్ లక్ష్మీ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు.

    2017లో కలిసినప్పటి ఫొటో

    2017లో కలిసినప్పటి ఫొటోను అప్పట్లో రాయ్ లక్ష్మీ షేర్ చేసింది. అకాన్ భారత్‌కు రావడం చాలా హ్యాపీగా ఉంది. అర్ధరాత్రి జరిగిన పార్టీ అదిరింది. అక్కడ అకాన్‌ను కలుసుకొన్నాను అని రాయ్ లక్ష్మీ ట్వీట్ చేసింది. మళ్లీ ఇండియాకు త్వరగా రావాలని కోరుకొంటున్నాను అని గతేడాది ట్వీట్‌లో పేర్కొన్నది.

    ఏడు సినిమాలతో బిజీ బిజీగా

    ఏడు సినిమాలతో బిజీ బిజీగా

    గతేడాది జూలీ2 చిత్రంలో నటించిన బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ దక్షిణాది ముఖం చూసింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. తమిళంలో నేయా2, యార్, ఝాన్సీ, సిండ్రెల్లా లాంటి చిత్రాల్లో నటిస్తున్నది.

    English summary
    The actress Raai Laxmi met with American singer Akon. She was all smiles posing for the picture with Akon. She was dressed in a shimmering black dress while the singer was sporting a casual white shirt. Raai Laxmi has about seven films in her kitty currently. She is part of Tamil movies like Neeya 2, Yaar, Jhansi and Cinderella.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X