రాశీ ఖన్నాకు కోలీవుడ్‌లో మరో ఆఫర్.. బాగానే బిజీ అవుతోంది!
రాశీ ఖన్నా ప్రస్తుతం మంచి జోరు మీదుంది. గత వారం రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ వైపు వర్కౌట్లు చేస్తూ మరో వైపు వెరైటీ ఫోటో షూట్లు చేస్తూ హల్చల్ చేస్తోంది. రాశీ ఖన్నా తన ఫోటోలతొనే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోందంటే ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే బిజీగా అవుతోంది. ప్రస్తుతం ఆమె మరో తమిళ చిత్రంలో ఎంపికైంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సంగతమిళన్( తెలుగులో విజయ్ సేతుపతి) చిత్రంలో రాశీ ఖన్నా విజయ్ సరసన నటించింది. ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని మూట గట్టుకుంది. అది వేరే విషయమనుకోండి. తాజాగా మళ్లీ విజయ్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. విజయ్ సేతుపతి తుగ్లక్ దర్బార్ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు తుగ్లక్ దర్భార్ యూనిట్ అయిన సెవెన్ స్క్రీన్ స్టూడియో స్పందిస్తూ.. విజయ్ సేతుపతి హీరోగా రాబోతోన్న తుగ్లక్ దర్బార్ చిత్రంలో రాశీ ఖన్నాను హీరోయిన్‌గా ఎంపికైందని ప్రకటించింది. మామూలుగా ఈ పాత్రకు ముందుగా అదితీ రావ్ హైదరీని తీసుకున్నారు, డేట్ల సమస్య తలెత్తడంతో రాశీ ఖన్నాను తీసుకున్నారు. మరోసారి విజయ్ సేతుపతి సర్‌తో నటించేందుకు ఎంతోఆసక్తికగా ఎదురుచూస్తున్నాను అంటూ రాశీ ఖన్నా ఆనందాన్ని వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











