జూన్ 12న బాయ్ ఫ్రెండుతో హాట్ బ్యూటీ ఎంగేజ్మెంట్
హైదరాబాద్: తమిళ హీరోయిన్ అలీషా అబ్దుల్లా ప్రేమ వివాహానికి సిద్ధమైంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ వేల్ నవీన్ దెవన్ రాజ్ ను వివాహం చేసుకోబోతోంది. జూన్ 12న పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరుగబోతోంది. వచ్చే ఏడాది వివాహం జరుగబోతోంది.
అలీషా అబ్దుల్లా బ్యాగ్రౌండ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు ప్రొఫెషనల్ బైక్ రేసర్. భారత దేశపు మొట్టమొదటి ఫిమేల్ రేసింగ్ ఛాంపియన్ కూడా. 26 ఏళ్ల అలీషా ఇప్పటి వరకు దేశ విదేశాల్లో అనేక రేసుల్లో పాల్గొన్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.
2014లో 'ఇరుంబు కుతిరాయ్' అనే సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా అలీషా అబ్దుల్లా నటిగా తెరంగ్రేటం చేసారు. ఆ సినిమా తర్వాత మళ్లీ రేసింగుల్లో బిజీ అయ్యారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న 'సైతాన్' అనే చిత్రంలో నటిస్తోంది.
చెన్నైలో పుట్టి పెరిగిన అలీషా అబ్దుల్లా చిన్న తనం నుండే రేసింగ్ మీద మక్కువతో రేసర్ గా ఎదిగింది. అందగత్తె కూడా కావడంతో సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. తన ఎంగేజ్మెంట్ గురించి అలీషా మాట్లాడుతూ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలిపారు. మహాబలిపురంలోని రిసార్టులో ఎంగేజ్మెంట్ వేడుక ప్లాన్ చేసారు. వచ్చే ఏడాది జనవరి 18న బాలిలో వెడ్డింగ్ గ్రాండ్ గా జరుగబోతోంది.

అలీషా అబ్దుల్లా...
అలీషా అబ్దుల్లా ఇండియన్ రేసర్ మరియు నటి. చెన్నైలో జన్మించింది.

9 ఏళ్ల వయసు నుండే
9 ఏళ్ల వయసులోనే అలీషా రేసర్ కావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండటంతో రేసర్ గా ఎదిగింది.

ఇండియన్ ఫిమేల్ చాంపియన్
భారత దేశపు మొట్టమొదటి ఫిమేల్ రేసింగ్ ఛాంపియన్ గా అలీషా చరిత్ర సృష్టించింది.

సినిమాల్లో..
అందగత్తె కూడా కావడంతో అలీషాకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. వివాహం తర్వాత కూడా ఆమె రేసర్ గా కొనసాగనుంది.


Click it and Unblock the Notifications











