షారుక్ పక్కన సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్.. నీచమైన కామెంట్స్, భగ్గుమన్న ఫ్యాన్స్!

Recommended Video

Racist Remarks On Atlee, Fans Rescue And Slammed The Trolls || Filmibeat Telugu

తమిళ హీరో విజయ్‌తో 'తేరి', 'మెర్సల్' లాంటి హిట్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు అట్లీ... ఇటీవల చైన్నైలోని ఎంఏ చిదంబరం ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చెన్నై-కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్‌లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌ పక్కనే కూర్చుని మ్యాచ్ చూశారు. వీరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోస్ చూసిన సినీ అభిమానులు...ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందేమో? అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అయితే కొందరు అట్లీ స్కిన్ కలర్ గురించి విమర్శిస్తూ మాట్లాడటం వివాదంగా మారింది. అయితే వెంటనే తమిళ అభిమానులు, అట్లీని ఇష్టపడే వారు రంగంలోకి దిగి... స్కిన్ కలర్ గురించి ట్రోల్స్ చేస్తున్న వారిపై ఎదురు దాడి ప్రారంభించారు.

టాలెంటుతో అట్లీ ఈ స్థాయికి వచ్చాడు

‘ఎందుకు మీరు అట్లీ శరీర రంగు మీద చెత్త కామెంట్స్ చేస్తున్నారు. అట్లీ తన సొంత టాలెంటుతో కష్టపడి పైకి రావడం వల్లనే ఇపుడు షారుక్ పక్కన కూర్చుని మ్యాచ్ చూడగలుగుతున్నాడు. ఇంట్లో కూర్చుని ఇలాంటి కామెంట్స్ చేస్తున్న మీరు ఏం సాధించారు? అంటూ మండి పడుతున్నారు.

అతడి భార్య గర్వపడుతోంది

‘‘నేను కూడా నల్లగానే ఉంటాను. కానీ అట్లీ మీద ఇలాంటి కామెంట్స్ వస్తుంటే బాధేస్తోంది. గతంలో అతడి భార్యతో పబ్లిక్‌లోకి వచ్చినపుడు కూడా చాలా మంది ఇలాంటి కామెంట్సే చేశారు. అలా కామెంట్స్ చేసే వారంతా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అతడు ఆ స్థాయికి వచ్చినందుకు అట్లీ భార్య ప్రియా గర్వరంగా ఉంది.'' అని ఓ అభిమాని వ్యాఖ్యానించారు.

అసలైన భారతీయుల రంగు అదే

‘‘అవును అతడు నల్లగా ఉన్నాడు. దాన్ని అపహాస్యం చేయాల్సిన అవసరం ఏముంది? అసలైన, పురాతన భారతీయుల రంగు నలుపే. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు షారుక్ ఖాన్ పక్కన కూర్చుని మ్యాచ్ చూడాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ అట్లీ తన టాలెంటుతో ఈ అవకాశం దక్కించుకున్నారు.'' అని పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.

త్వరలో సినిమా చేస్తాడు

అట్లీ స్కిన్ కలర్ గురించి విమర్శలు చేసే వారు త్వరలోనే రియలైజ్ అవుతారు. ఇపుడు షారుక్ పక్కన కూర్చున్నాడు.. త్వరలోనే షారుక్‌తో సినిమా కూడా చేయవచ్చు. అంత టాలెంట్ అతడిలో ఉంది.అపుడు అతడి లెవలే వేరేలా ఉంటుంది. కానీ అట్లీ స్కిన్ కలర్ గురించి కామెంట్స్ చేస్తున్నవారిది ఏ లెవల్? అంటూ తమిళ అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

షారుక్ ఖాన్, అట్లీ

షారుక్ ఖాన్, అట్లీ

షారుక్ ఖాన్ సినిమాల విషయానికొస్తే... ‘జీరో' సినిమా ప్లాప్ తర్వాత ఈ టాప్ హీరో ఆలోచనలో పడిపోయారు. ఎలాంటి సినిమా చేయాలనే దానిపై డైలమాలో ఉన్నారు. త్వరలోనే తర్వాత సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత అట్లీ విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. తేరి, మెర్సల్ తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X