కూతురు రూమర్స్ పై మాజీ హీరోయిన్ రాధ ఫైర్
రాధ మాట్లాడుతూ... నటనలో నా ప్రత్యేకత ఏమిటో నిరూపించుకున్నాను. అలాంటిది నా కుమార్తెలు నిరూపించుకోలేరా? చేప పిల్లకు ఈత నేర్పించాల్సిన అవసరం ఉందా? నటనలో నేను తిమింగలం అనుకుంటే నా కుమార్తె చిన్న చేపలా అయినా పేరు తెచ్చుకోరా అంటోంది. తులసి నటనపై అనుమానాలున్నవారు షూటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి రండి, అప్పుడు అర్థమవుతుందని అంటోంది.
చాలా కాలం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'కడల్'. మణితర్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సాధారణ సినిమాల కంటే ఆయన సినిమాలు ప్రతి విషయంలోనూ భిన్నంగా ఉండటమే అందుకు కారణం. 2010లో వచ్చిన 'రావణ్' చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. దాదాపు రెండు మూడేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్ర 'కడల్'.
సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 1న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తమిళ హీరో కార్తీక తనయుడు గౌతమ్, మాజీ హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి 'కడలి' చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం అవుతున్నారు. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications












