మీ పేరులో ఆ పదం తొలగించండి.. విశాల్ కామెంట్స్‌పై విరుచుకుపడ్డ రాధారవి!

తమిళ చిత్రపరిశ్రమలో రాధారవి వివాదాస్పద నటుడిగా మారుతున్నారు. మీటూ ఉద్యమ సమయంలో హీరోయిన్లు, ఇతర నటీమణులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని రోజుల క్రితం లేడీ సూపర్ స్టార్ నయనతారని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చాలా మంది నటులు, నటీమణులు రాధా రవిపై విరుచుకుపడ్డారు. హీరో విశాల్ కూడా రాధారవిని తీవ్రంగా విమర్శించారు. విశాల్ చేసిన ఓ ట్వీట్ కు రాధా రవి సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ పదం తొలగించండి

ఆ పదం తొలగించండి

విశాల్ ట్వీట్ చేస్తూ.. డియర్ రాధారవి సర్.. మహిళల గురించి, ప్రత్యేకంగా ఓ నటి గురించి మీరు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నాయి. ఓ మహిళ వలనే మీరు పెరిగి పెద్దయ్యారు. కనీసం ఆ జ్ఞానం కూడా మీకు లేదు. మీకు మహిళంటే గౌరవం లేదు కాబట్టి రాధా అనే పేరుని తొలగించి కేవలం రవి అని పెట్టుకోండి అంతో విశాల్ ట్వీట్ చేశాడు. రాధారవి నయనతారపై చేసిన వ్యాఖ్యలకి గాను ఆయన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన సంస్థల నుంచి తొలగిస్తున్నారు. డీఎంకే పార్టీ కూడా అతడిని సస్పెండ్ చేసింది.

ఆర్కే నగర్ లాంటిదే

ఆర్కే నగర్ లాంటిదే

విశాల్ వ్యాఖ్యలపై రాధారవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది కూడా ఆర్కేనగర్ లాంటి వ్యవహారమే అని విశాల్ పై సెటైర్లు వేశాడు. విశాల్ కు ఏమీ తెలియదు. కానీ అన్ని విషయాల్లో తలదూర్చుతుంటాడు అని రాధారవి వ్యాఖ్యానించారు. రాధా అనేది మా తండ్రి పేరు. అందుకే అది నా పేరు ముందు వచ్చింది అని రాధారవి తెలిపారు. విశాల్ గతంలో ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీకి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం అతడి నామినేషన్ నే తిరస్కరించడంతో విశాల్ కు ఆరంభంలోనే చుక్కెదురైంది. దీనిపైనే పరోక్షంగా రాధారవి సెటైర్లు వేశారు.

నయనతారపై ఘాటుగా

నయనతారపై ఘాటుగా

రాధారవి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివాజీ గణేశన్, ఎంజీఆర్ లాంప్ నటులు మరణం లేని ఇమేజ్ ని సంపాదించుకున్నారు. వారితో నయనతారని పోల్చుతుంటే నాకు భాదగా ఉంది. నయనతార స్టార్ హీరోయిన్. కాదనను.. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. లేడీ సూపర్ స్టార్ అని అంతా పిలుస్తున్నారు. కానీ దిగ్గజ నటులతో ఆమెకు పోలికేంటి అని రాధారవి ప్రశ్నించారు. నయనతారపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా ఆమె ఫేమస్ అయింది. దానికి కారణం జనాలు ఏ విషయాన్ని అయినా సులభంగా మరచిపోతారు.

దెయ్యాలు కూడా పారిపోతాయి

దెయ్యాలు కూడా పారిపోతాయి

నయనతార సీత పాత్రలో నటించింది. ఆమె దెయ్యం పాత్రలో కూడా నటిస్తోంది. గతంలో దేవుళ్ళ పాత్రలలో నటించడానికి కేవలం గౌరవప్రదమైన హీరోయిన్లని మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా నటించవచ్చు. ఎవరెవరితోనే తిరిగేవాళ్ళతో దేవుళ్ళ పాత్రలు చేయిస్తున్నారు. నయనతార దెయ్యం పాత్రలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆమెని మాములుగా చూస్తేనే దెయ్యాలు పారిపోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల వలనే అంతా రాధారవిపై విరుచుకుపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X