నయనతారని అవమానించింది అందుకేనా.. మరోసారి రాధారవి వ్యాఖ్యలు!
తమిళ సీనియర్ నటుడు రాధారవి తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. మీటూ ఉద్యమ సమయంలో కూడా రాధారవిపై విమర్శలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం రాధారవి లేడీ సూపర్ స్టార్ నయనతారపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. రాధారవి చేసిన వ్యాఖ్యలు నయనతారని అవమానించేలా ఉండడంతో చాలా మంది సినీ ప్రముఖులు రాధారవిపై దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత కూడా రాధారవి దూకుడు తగ్గలేదు. రాధారవి తాను చేసిన వ్యాఖ్యలని సమర్థించుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధారవి నయనతారపై చేసిన వ్యాఖ్యలు గురించి మరోమారు స్పందించారు.

నయనతార స్పందించాలి
మీరు చేసిన వ్యాఖ్యలకు నయనతారకు క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించగా రాధారవి స్పందించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందో నయనతార చెప్పాలి. తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానని నయనతార చెబితే అప్పుడు క్షమించమని కోరుతా. అంతవరకు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని రాధారవి అన్నారు. ఎవరో కొంతమంది మినహా మిగిలిన వారంతా నా వ్యాఖ్యల్ని సమర్థించారు. అంటే నా వైపు నిజం ఉనట్లు అని రాధారవి అన్నారు.

ఆ కోపంతోనేనా
నయనతార ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్. ఆమె సంపాదన స్టార్ హీరోలకు దీటుగా ఉంటోంది. నయన్ ఎప్పుడూ రాధారవిని అధికమించేసి స్టార్ హీరోలతో పోటీ పడుతోంది. ఆ అక్కసుతోనే రాధారవి నయన్ పై విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలపై రాధారవి స్పందించారు. అలా అయితే నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది నటీనటులు నా కళ్ళ ముందే స్టార్స్ గా ఎదిగారు. వాళ్ళందరిపై నేను ఎలాంటి కామెంట్స్ చేయలేదే అని రాధారవి ప్రశ్నించారు.

విలువ తగ్గిపోదు
చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య పోటీని నేను పట్టించుకోను. ఎందుకంటే ఎవరి ప్రత్యకత వాళ్ళకు ఉంటుంది. ఎవరి పారితోషికం వాళ్ళకు వస్తుంది. ఇందులో అసూయ పడాల్సిన అవసరం లేదని రాధారవి అన్నారు. కాస్త తక్కువ పారితోషికం తీసుకున్నంత మాత్రాన నా నటనకు ఉన్న విలువ తగ్గిపోదు అని రాధారవి అన్నారు.

హాట్ కామెంట్స్
ఓ మీడియా సమావేశంలో నయనతారపై రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ఈ వివాదం మొదలైంది. నయనతార ఎక్కువగా దెయ్యాల సినిమాలు చేస్తోంది. ఆమెని చూస్తే దెయ్యాలే పారిపోతాయి. గతంలో దేవతల పాత్రల్లో నటించాలంటే కొన్ని ప్రత్యేకతలు ఉన్న హీరొయిన్లని మాత్రమే తీసుకునేవాళ్ళు. గౌరవ ప్రదమైన నటీమణులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు దెయ్యాల పాత్రలు చేసే, ఎవరెవరితోనే తిరిగే నయనతార లాంటి వాళ్ళు కుడా నటిస్తున్నారు అంటూ రాధారవి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











