twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏకగ్రీవంగా రాధారవి ఎన్నిక.. చిన్మయికి చుక్కెదురు

    |

    దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ ఎన్నికలు వివాదంగా మారాయి. ఈ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద నిలబడటంతో ఈ రచ్చ మొదలైంది. ఈ యూనియన్‌ ఎన్నికలు బుధవారం చెన్నైలో జరిగాయి. వీరిద్దరి మద్య చాలా కాలం నుంచి యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.

    రాధారవిపై మీటూ ఆరోపణలు..

    రాధారవిపై మీటూ ఆరోపణలు..

    దేశంలో మీటూ ఆరోపణలు ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా మీటూ ఉద్యమం మొదలు పెట్టి నానా పటేకర్‌పై ఆరోపణలు చేసింది. ఇక అక్కడి నుంచి దక్షిణాది పాకింది. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని చిన్మయి ముందుండి నడించింది. వైరముత్తు, రాధారవి వంటి వారిపై చిన్మయి మీటూ ఆరోపణలు చేసింది.

     యూనియన్ నుంచి తొలగింపు..

    యూనియన్ నుంచి తొలగింపు..

    డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడుగా ఉన్న రాధారవి.. చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించి ఎంతగానో పోరాడింది. చివరకు. చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని కోర్టు తీర్పు నిచ్చింది. అలా చిన్మయి యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకుంది.

    ఏకగ్రీవంగా రాధారవి..

    ఏకగ్రీవంగా రాధారవి..

    డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్‌ నటుడు రాధారవి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి పోటీ చేసింది. ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

     కోర్టుకు వెళ్తానంటూ..

    కోర్టుకు వెళ్తానంటూ..

    చిన్మయి నామినేషన్‌ తిరష్కరణ గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్‌ తిరస్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చింది.

    English summary
    radha ravi elected as unanimous in dubbing union election. Chinmay's Nomination Was rejected By Election Officer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X