twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ రూమ్‌లోకి వెళ్తే ఇక అంతే, ఆ భయంతో.. మీ టూపై రాధారవి

    |

    తమిళ పరిశ్రమలో ప్రముఖ నటుడు రాధారవి మీ టూ ఉద్యమంపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. ఇటీవల ఓ తమిళ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన ప్రస్తుత పరిస్థితిపై తనదైన శైలిలో స్పందించారు. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధారవి.. పబ్లిసిటీ కోసం కామెంట్లు చేయడం సర్వసాధారణమైంది. అని అన్నారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే..

    గోరంతలు కొండంతలు చేసి

    గోరంతలు కొండంతలు చేసి

    ఒకవేళ అనుమతి లేకుండా హీరోయిన్ రూమ్‌లోకి డైరెక్టర్ ప్రవేశిస్తే అతని కెరీర్ అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతీ చిన్న విషయాన్ని గోరంతలు కొండతలుగా భూతద్దంలో చూపిస్తున్నారు. హీరోయిన్లను రూమ్‌లో కాకుండా రోడ్డుపై మేకప్ చేయిస్తే సరిగా ఉంటుందేమో అని అన్నారు.

    మాట్లాడితే లైంగిక వేధింపులని

    మాట్లాడితే లైంగిక వేధింపులని

    గతంలో నటీనటులు, టెక్నీషియన్ల మధ్య మంచి సమన్వయం ఉండేది. ఓ సినిమాకు పనిచేస్తూ గొప్ప అనుభవంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఓ నటికి సీన్ గురించి వివరించాలంటే భయపట్టుకొంటుంది. ఎక్కడ లైంగిక వేధింపులు వస్తాయనే భయం వెంటాడుతున్నది అని రాధారవి పేర్కొన్నారు.

    తనను ఆఫీస్‌కు ఒంటరిగా

    తనను ఆఫీస్‌కు ఒంటరిగా

    మీ టూ ఉద్యమం మొదలైన సమయంలో నటుడు రాధారవిపై ఓ మహిళ నటి తీవ్ర ఆరోపణలు చేసింది. రాధారవి నన్ను ఆయన ఆఫీస్‌కు రమ్మని తనను బలవంతంగా ముద్దు పెట్టుకొన్నారు. ఊపిరాడకుండా గట్టిగా కౌగిలించుకొన్నారు. నీ స్నేహితులను తీసుకు రాకుండా ఒంటరిగా నన్ను రమ్మన్నాడు అని రాధారవిపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.

    రాజకీయంగా పవర్ ఉందని

    రాజకీయంగా పవర్ ఉందని

    ఓ పని కోసం రాధారవి సహాయం తీసుకోవాలని వెళ్లాను. కానీ ఆయన చేష్టల కారణంగా నేను ఆ పనిని వదిలేశాను. అప్పట్లో ఈ విషయాన్ని మీడియాకు చెప్పాలని అనుకొన్నాను. కానీ ఆయనకు రాజకీయ బలం ఉందని, భయంతో ఊరుకొన్నాను అని ఆ మహిళ చెప్పడం గమనార్హం.

    English summary
    Radha Ravi, who is facing the sexual harassment allegation by an anonymous woman, has mocked the 'Me Too' movement. He said, If a director enters heroine's room without permission, his career is over. We cannot ask the heroines to do make-up in streets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X