నయనతారని తిడుతుంటే చప్పట్లు, కేరింతలు.. ఎవడాపుతాడో చూస్తా, మళ్ళీ రెచ్చిపోయిన నటుడు!

Recommended Video

'Why Should I Apologise To Nayanathara?', Radha Ravi Sensational Comments Again || Filmibeat Telugu

లేడీ సూపర్ స్టార్ నయనతార, సీనియర్ నటుడు రాధారవి మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. రాధారవి ఏమాత్రం తగ్గకుండా తన దూకుడు స్వభావంతో రెచ్చిపోతున్నారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో రాధారవి నయనతారని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్రపరిశ్రమలో పెను దుమారం రేపాయి. చాలా మంది సినీ ప్రముఖులు రాధారవి వ్యాఖ్యలని తీవ్రంగా తప్పుబట్టారు. తన వ్యాఖ్యలు భాదించి ఉంటే క్షమించాలి అని వ్యాఖ్యానించిన రాధారవి ఇప్పుడు రివర్స్ అయ్యారు. తాను నయనతారకు క్షమాపణ చెప్పలేదని, చెప్పను కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దెయ్యాలే పారిపోతాయి

దెయ్యాలే పారిపోతాయి

రాధారవి ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దెయ్యాల చేస్తున్న వారే దేవుళ్లుగా నటిస్తున్నారు. నయనతార దెయ్యాల పాత్రలు చేస్తోంది. అదే సమయంలో సీత పాత్రలో కూడా నటిస్తోంది. నయనతారని చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి. గతంలో దేవతల పాత్రలు చేయడానికి గౌరవప్రదమైన నటులనే ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరు పడితే వారు నటించేస్తున్నారు. నయనతార ఎవరితో పడితే వారితో తిరుగుతోందంటూ రాధారవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.

నేనేమైనా నేరం చేశానా

నేనేమైనా నేరం చేశానా

నయనతారపై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళ సినీ ప్రముఖుల నుంచి రాధారవికి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాధారవి మాట్లాడుతూ.. నా మాటలు ఎవరినైనా భాదించి ఉంటే క్షమించాలి అని కోరారు. తాజాగా ఓ షార్ట్ ఫిలిం లాంచ్ ఈవెంట్ కు హాజరైన రాధారవి నయనతారపై వ్యాఖ్యలతో మళ్ళి రెచ్చిపోయారు. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తానేం నేరం చేయలేదని రాధారవి వ్యాఖ్యానించారు.

ఆమెని తిడుతుంటే కేరింతలు

ఆమెని తిడుతుంటే కేరింతలు

రాధారవి మాట్లాడుతూ నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ నేను మాట్లాడిన విషయాల్లో తప్పు ఉంటే ఆ సమయంలోనే మీడియా మిత్రులు నాకు వార్నింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా తాను మాట్లాడుతుంటే చప్పట్లు, కేరింతలు కొడుతున్నారు. తన వ్యాఖ్యల్లో నిజం లేకుంటే ఇంతమంది నుంచి నాకు మద్దతు ఎందుకు లభిస్తుంది అని రాధారవి ప్రశ్నించారు.

ఎవడాపుతాడో చూస్తా

ఎవడాపుతాడో చూస్తా

తాను ఇక ఎక్కువకాలం నటుడిగా కొనసాగలేనని కొంతమంది అనుకుంటున్నారు. సినిమాలు కాకుంటే నాటకాల్లో నటిస్తా, స్టేజి షోలు చేస్తా.. ఎవడైనా నన్ను ఆపగలడా అని రాధారవి వ్యాఖ్యానించాడు. నేను చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. అంగీకరించే వారు అంగీకరించవచ్చు లేకుంటే పట్టించుకోకుండా వదిలేయండి. అంతేకాని దీనిని పెద్ద వ్యవహారంగా మార్చవద్దు అని రాధారవి అన్నారు.

భయపడవద్దని అన్నారు

భయపడవద్దని అన్నారు

ప్రముఖ దర్శకుడు పరారసు నాతో మాట్లాడుతూ.. జరిగిన వ్యవహారంలో నా తప్పు ఏమిలేదని, ఎవరికీ భయపడవద్దని అన్నట్లు రాధారవి తెలిపారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని ఆయనతో చెప్పానని అన్నారు. ఈ సంఘటన తర్వాత కొందరు దర్శకులు, నిర్మాతలు రాధారవిని తమిళ చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X