సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో రాధ చిన్నకూతురు...!
ఒకప్పటి అందాల తార రాధ పెద్ద కూతురు కార్తీక ఇంకా హీరోయిన్ గా కుదురుకోనేలేదు, అప్పుడే ఆమెకి చెల్లి నుంచే పోటీ ఎదురుకానుంది. జోష్ తో వెండితెరకి పరిచయమైన కార్తీక ఆ తర్వాత తమిళంలో 'కో" చిత్రంతో నటించింది. ఆ సినిమా తమిళనాట బ్రహ్మాండమైన విజయం సాధించడమే కాకుండా, తెలుగులో రంగం పేరిట అనువాదమై ఇక్కడా శతదినోత్సవం కూడా చిరంజీవి చేతులమీదుగా జరుపుకొంది. అయినప్పటికీ కార్తీక కెరీర్ ఏమాత్రం ముందుకు కదలకుండా ఉన్నచోటే నిలిచిపోయింది.
ఇలాంటి టైమ్ లో రాధ చిన్న కూతురు తులసి తెరంగేట్రానికి అనుకోకుండా ముహూర్తం కుదిరేసింది. మణిరత్నం తన తదుపరి చిత్రంలో కథానాయికగా తులసి బాగుంటుందని భావించి, రాధకి ఆ సంగతి చెప్పాడు. అయితే ఇంకా చిన్న పిల్లే కదా, అప్పుడే ఆమె హీరోయిన్ ఏంటని రాధ తటపటాయింది. కానీ తన పాత్రకి ఆమె బాగా సూటవుతుందని మణిరత్నం నచ్చెప్పాడని సమాచారం.
పదిహేనేళ్ల తులసి ఈ చిత్రంలో కార్తీక్ కొడుకు గౌతమ్ కి జోడిగా నటిస్తుంది. ముందుగా అనుకున్నట్టు ఈ చిత్రంలో కమల్ చిన్న కూతురు అక్షరాహాసన్ నటించడం లేదు. కార్తీకకి రాని స్టార్ డమ్ తులసికి వస్తుందేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











