హాలీవుడ్ రేంజ్‌లో తీయడం కాదు.. ముందు అది తెలుసుకోవాలి.. దర్శకుడు శంకర్‌పై రాధారవి ఫైర్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2). అప్పట్లో సంచలనం సృష్టించిన ఇండియన్ (భారతీయుడు) చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోన్న విషయం తెలిసిందే. అయితే లైకా సంస్థ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరగడం, ముగ్గురు ప్రాణాలను కోల్పోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి ఫైర్ అయ్యాడు.

ముగ్గురు వ్యక్తుల దుర్మరణం..

ముగ్గురు వ్యక్తుల దుర్మరణం..

భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతుండగా.. 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

శంకర్‌కూ గాయాలు..

శంకర్‌కూ గాయాలు..

అయితే ఈ ప్రమాదంతో దర్శకుడు శంకర్‌కూ గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి. కాజల్ అగర్వాల్ కూడా సెకన్‌లో తప్పించుకున్నానని తెలిపింది. దాదాపు పది మందికి తీవ్ర గాయాలయ్యాని తెలిపారు. ఈ ఘటనతో కోలీవుడ్, టాలీవుడ్ మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది.

 కోటి విరాళం..

కోటి విరాళం..

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కమల్ హాసన్ కన్నీటి పర్యంతమయ్యాడు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. కమల్ నిర్ణయాన్ని అందరూ హర్షించారు. అయితే ఈ ఘటనపై కోలీవుడ్ చాలా సీరియస్ అయిందని టాక్.

Recommended Video

#Indian2 Sets Video : Kamal Haasan's 'Bharateeyudu 2' Sets Crane Mishap | Filmibeat Telugu
రాధారవి ఫైర్..

రాధారవి ఫైర్..

డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై స్పందించాడు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయడం కాదు.. తన సెట్‌లో పని చేసేవారి జాగ్రత్తలను ముందు చూసుకోవాలంటూ పరోక్షంగా శంకర్‌పై కామెంట్ చేశారు. కమల్ హాసన్ కోటి రూపాయలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X