ఆందోళనలో దళపతి అభిమానులు.. ‘మాస్టర్’పై రాధిక పోస్ట్ వైరల్

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా అందరూ తమ తమ పనుల్లో బిజీ అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా కూడా ఎవ్వరూ భయపడటం లేదు. అయితే అన్నింటికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. థియేటర్లు, పాఠశాలు పున: ప్రారంభానికి అనుమతులు ఇవ్వడం లేదు. ముఖ్యం సినీ అభిమానులు తమ హీరోల చిత్రాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలా ఎన్నో చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.

విజయ్ ‘మాస్టర్'పై అంచనాలు..

విజయ్ ‘మాస్టర్'పై అంచనాలు..

దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న మాస్టర్‌పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాతి కమింగ్ అంటూ నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. మామూలుగా వేసవి సెలవుల్లో రావాల్సిన మాస్టర్.. కరోనా లాక్డౌన్ వల్ల ఇప్పటికీ థియేటర్లలోకి రాలేకపోతోంది.

దీపావళికి అంటూ రూమర్లు..

దీపావళికి అంటూ రూమర్లు..

ఇక ఆ మధ్య అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతో దీపావళికి సినిమా వస్తుందని ప్రచారం చేశారు. దీపావళికి మాస్టర్ వస్తాడని అందరూ ఆశించారు. కానీ అది కూడా వర్కవుట్ లేదు. దీంతో అభిమానులను చల్లబర్చాలని మాస్టర్ టీజర్‌ను విడుదల చేశారు.

అంచనాలు ఎక్కువయ్యాయి..

అంచనాలు ఎక్కువయ్యాయి..

ఇక మాస్టర్ టీజర్ బయటకు రావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. రౌడీ, మాస్ మాస్టర్ పాత్రలో విజయ్ స్టైల్,యాటిట్యూడ్ ఇలా ప్రతీ ఒక్కటి వైరల్ అయ్యాయి. విజయ్, విజయ్ సేతుపతి మధ్య టగ్ ఆఫ్ వార్ అదిరిపోయేలా ఉంది. ఈ ఇద్దరూ తలపడే సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండోబోతోన్నట్టు కనిపిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

తాజాగా అలా..

తాజాగా అలా..


అయితే మాస్టర్ సినిమాను థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మాస్టర్‌ ఓటీటీలో రాబోతోందనే రూమర్లు వినిపించాయి. దీనిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే రాధిక ఓ పోస్ట్ చేసింది.

Recommended Video

Shilpa Shetty Ready To Re Entry In Tollywood After 20 Years
నాకు మాత్రం అలానే..

నాకు మాత్రం అలానే..

మాస్టర్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోందనే వార్తలు వింటున్నాను.. అది నిజమా.. నాకైతే సినిమాను థియేటర్లలో చూడాలని ఉంది.. మరి మీకు అంటూ కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లు అవసరమా? ఓటీటీలోనే బెటర్ అంటూ కొందరంటే.. థియేటర్లలోనే చూడాలని ఇంకొందరు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X