హీరో విశాల్‌పై నటి రాధిక ఫిర్యాదు

By Bojja Kumar

తమిళ హీరో విశాల్‌పై నటి, రాడన్ పిక్చర్స్ అధినేత రాధిక నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. విశాల్ నుంచి తమకు రావాల్సిన రూ. 9 కోట్ల రూపాయలు తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాల్ ఇటీవల నటించిన 'వేడి' చిత్రం విడుదలకు సంబంధించిన విశాల్ ఆ సంస్థకు రూ. 12 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 3 కోట్లు శాటిలైట్ రైట్స్ విషయమై మినహాయించుకోగా...మిగతా రూ. 9 కోట్లకు గాను విశాల్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. తమకు రావాల్సిన డబ్బు విషయంలో విషాల్ ప్రవర్త సరిగా లేక పోవడంతో రాధిక నడిగర్ సంఘాన్ని ఆశ్రయించింది.

ప్రస్తుతం విశాల్ 'సమరన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన త్రిష హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇంకా సునైనా, ప్రకాష్ రాజ్, మిలింద్ సోమన్, రాజేంద్రన్ నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రీఫీ అందిస్తున్నారు. బాలాజీ రియల్ మీడియా సంస్థపై టి. రమేష్ నిర్మిస్తున్న 'సమరన్' చిత్రం మే 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X