కన్నీటి పర్యంతమైన డైనమిక్ హీరోయిన్ రాధిక!

By Sindhu

మోస్ట్ డైనమిక్ అండ్ డేరింగ్ లేడి రాధిక..ఇటీవల జరిగిన ఓ పరిణామం పట్ల తీవ్రంగా కలత చెంది, కంటనీరు పెట్టుకోవడం చూపరులను కలచివేసింది. రాధిక భర్త శరత్ కుమార్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో 'జగ్గుభాయ్" అనే ఓ చిత్రం రూపొందుతోంది. జీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని రాధిక నిర్మిస్తోంది. ఈ చిత్రం మొదటి కాపి కూడా రాకుండానే, ఈ చిత్రం వీసిడీలు, డీవిడీలు మార్కెట్ లో ప్రత్యక్షం కావడం తమిళ చిత్ర పరిశ్రమలో పెను దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఈ అవాంఛనీయ, దురదష్టకర సంఘటనను ఖండించడానికి, రాధిక దంపతులకు సంఘీభావాన్ని ప్రకటించడానికి తమిళ చిత్రసీమలోని అతిరధమహారధులంతా సమావేశమయ్యారు.

రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య తదితర అగ్ర హీరోలంతా పాల్గొన్న ఈ సమావేశంలో ఈ పరిణామం పట్ల, ఆగ్రహాన్ని, ఆవేదననూ వ్యక్తం చేస్తూ మాట్లాడిన రాధిక, ఈ సందర్బంగా భావోద్వేగానికి లోనై ఒక దశలో కంటతడి పెట్టుకున్నారు. సినిమా విడుదలైన రెండో రోజో, మూడో రోజో, పైరేటెడ్ సీడీలు మార్కెట్ లోకి రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, ఓ చిత్రం ఫస్ట్ కాపీ కూడా రాకుండానే, ఈ చిత్రాన్ని పైరసీ చేయగలగడం పరిశ్రమ వర్గాలను బెంబేలెత్తిస్తున్నది. ఈ సంఘటన పట్ల తమిళ అగ్ర హీరోలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X