ఒకప్పడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగి రిటైర్ అయి, టి.వీ.రంగంలో ప్రవేశించి సీరియల్స్ నిర్మిస్తూ సంచలనం సృష్టిస్తున్నాది హీరోయిన్ రాధిక శరత్ కుమార్. ఆమెకి ఇప్పుడో తల నొప్పి వచ్చి పడింది. ఆమె రాడాన్ మీడియా వర్క్స్ లిమిటెడ్ పై నిర్మిస్తున్న తమిళ సీరియల్స్ అరసీ, లక్ష్మి షూటింగ్ స్పాట్ (ఓ ప్రైవేటు హాస్పటిల్ ప్రాగణం)లో సీరియల్ క్రూ పై దాడి జరగింది. లైట్ మెన్ అండ్ సినీ టెక్నీషియన్ష్ అసోసియేషన్ సభ్యులు దాదాపు 50 మంది వచ్చి దాడి చేసారు. దాంతో వెంటనే షూటింగ్ కేన్సిల్ చేసిందామె. లొకేషన్ లో ఉన్న దాదాపు ఇరవై మందికి గాయాలు అవటమే కాక కొన్ని లక్షల రూపాయల రూపాయలు నష్టం జరిగిందంటూ రాధిక చెన్నై పోలీస్ కమీషనర్ నాంచిల్ కుమరన్ కి కంప్లైంట్ చేసారు. తమకూ సినిమా వాళ్ళతో సమానంగా వేతనాలు ఇవ్వాలని ఆ అసోసియేషన్ డిమాండట. గత కొద్ది రోజులుగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయట. చివరకు వివాదం ముదిరి పాకాన పడి ఇలా అందరినీ రోడ్డున పడేలా చేసింది. చెన్నై మెట్రో పోలీసులు కేసు రిజిస్టరు చేసి దోషులును వెతికే కార్యక్రమంలో పడ్డారట. ఈ కేసు కూడా తాము తీస్తున్న సీరియల్స్ లా సాగకూడదంటూ అందరూ కోరుకుంటున్నారట.