twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫలించిన రాధిక ఎదురు చూపులు..

    By Sindhu
    |

    గత కొన్నేళ్లుగా బుల్లితెరకే పరిమితమైన ప్రముఖ నటి రాధిక, మళ్లీ చాలా కాలం గ్యాప్ తర్వాత వెండితెరకు వస్తోంది. తాజాగా ఓ తమిళ సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించింది. 'ఆవారా' ఫేం కార్తీ కథానాయకుడుగా నటించే 'శకుని' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించేందుకు ఆమె సైన్ చేసింది. ఇది నెగటివ్ ఛాయలతో సాగే పాత్ర అని తెలుస్తోంది.

    'సినిమాలలో తిరిగి నటించాలని గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నాను. అయితే, సరైన ఆఫర్లు రాలేదు. ఇప్పుడిందులో చాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి పాత్రతోనే నా రీ- ఎంట్రీ జరగాలని కోరుకున్నాను'అంటోంది రాధిక. ఇందులో తనది పూర్తి నిడివి పాత్ర అనీ, తనకు, కార్తీకి మధ్య వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ఆమె చెబుతోంది. ఈ సినిమా తర్వాత నటిగా ఆమె మళ్లీ బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

    English summary
    Radhika was a popular yesteryears heroine during her days and she started playing supporting roles starting with Hero Karthi movie 'Shakuni'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X