ఆ వార్తల్లో నిజం లేదు.. స్పందించిన రాధికా శరత్ కుమార్
రాధికా శరత్ కుమార్ గురించి నిన్న సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలుశిక్ష పడిందంటూ వార్తలు రచ్చ రచ్చ చేశాయి. ఓ నిర్మాణ సంస్థ వద్ద ఓ ప్రాజెక్ట్ కోసం డబ్బులు తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించడంలో ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. అలా వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడం, ఆ కేసుకు సంబంధించిన తీర్పునిన్న వెలువడంతో అందరూ షాక్ అయ్యారు.
రాధిక, శరత్ కుమార్‌కు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే దీంతో పాటు రాధికకు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై తాజాగా రాధిక స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాధిక చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్. నాకు కరోనా పాజిటివ్ రాలేదు..నేను సెంకడ్ డోస్ వేసుకున్నాక మామూలుగా కొంత ఒళ్లు నొప్పులు వచ్చాయి.. ఆ కేసులు, కరోనా గురించి వెబ్ సైట్స్ చెత్త వార్తలు రాస్తున్నాయి. ఆ కేసుపై మేం హైకోర్టుకు వెళ్తున్నాం.. నేను మళ్లీ పనిలోకి దిగాను.. అంటూ రాధిక చెప్పుకొచ్చింది. మొత్తానికి రాధిక తన భర్త శరత్ కుమార్‌తో కలిసి చేసిన రాజకీయ ప్రసంగాల ఎఫెక్ట్ బాగానే పడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











