విశాల్, కార్తీపై రాధిక ఫైర్.. శరత్ కుమార్‌ను లాగొద్దని వార్నింగ్
తమిళ నడిగర సంఘం ఎన్నికల్లో విశాల్‌పై మాటల దాడి కొనసాగుతునే ఉంది. గతంలో సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని నటులు శరత్ కుమార్, రాధారవిపై గతేడాది ఎన్నికల ప్రచారంలో విశాల్ ఆరోపణలు చేశారు. జూన్ 23న సంఘం కోసం జరిగే ఎన్నికల ప్రచారంలో గతంలో చేసిన ఆరోపణల వీడియోను విశాల్ షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది.
విశాల్ తీరును తప్పుపడుతూ వరలక్ష్మీ శరత్ కుమార్ తీవ్రంగా స్పందించింది. వాస్తవాలు లేకుండా మళ్లీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం సరికాదు. నా ఓటు నీవు కోల్పోయావు అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా విశాల్‌పై శరత్ కుమార్ భార్య నటి రాధిక భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ప్రకటన రూపంలో వెల్లడించారు.

విశాల్ వ్యాఖ్యలపై రాధిక స్పందిస్తూ.. శరత్ కుమార్ పై నీవు చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే రుజువు చేయి. పదే పదే అవాస్తవాలను ఇతరులపై రుద్దు వారి ప్రతిష్టకు భంగం కలిగించొద్దు. శరత్ కుమార్‌ను పదే పదే అవినీతి ఆరోపణల్లోకి లాగవద్దు. విశాల్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు అని తన ప్రకటనలో తెలిపారు.
నడిగర్ సంఘం కోశాధికారి కార్తీపై కూడా రాధిక మండిపడ్డారు. నీ ఆత్మకు లోబడి మాట్లాడాలని అన్నారు. అలాగే అధ్యక్షుడు నాజర్‌పై సీరియస్ అయ్యారు. తన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయని చెప్పడం సరికాదు. సంఘంలోని పెద్దలు పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తే నడిగర్ సంఘానికి, నటీనటులకు మంచిది కాదు అని రాధిక అన్నారు.


Click it and Unblock the Notifications











