నిర్మాత లైంగిక వేధింపులు
మొదటి రోజు నుంచి ఆ నిర్మాత చూపు నైపైనే..ఇక హీరో కమ్ దర్శకుడు అయిన తమిళరాసన్ గురించి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అలాగే ఎవరో ఫైనాన్సియర్స్ అంటూ పరిచయం చేసారు..వాళ్ళు కూడా నాతో సరసమాడటం ప్రారంబించారు. యూనిట్ సభ్యులైతే ఇక చెప్పనే అక్కర్లేదు... ఇదంతా ఓ కుట్ర ప్రకారం చేసారనిపిస్తోంది..అంటూ ఐటం గర్ల్ రహస్య నిర్మాతల మండలిలో కంప్లైంట్ ఇచ్చింది.
బోంబే టు గోవా, వసూల్ రాజా, అన్నన్ తంపి, వైగై వంటి చిత్రాలతో పాపులర్ అయిన ఈ చిన్నది తమిళరాసన్ తాజా చిత్రం మండపంలో చేస్తోంది. ఓ సెక్సీ డాన్స్ కి ఆమెను బుక్ చేసారు.రీసెంట్ గా ఆ పాటను పాండిచ్చేరిలో చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో ఆమెతో అంతా మిస్ బిహేవ్ చేసారని కంప్లైంట్. కానీ నిర్మాతలు ఆమె ముందునుకున్న దానికన్నా ఎక్కువ డిమాండ్ చేసిందని,ఆ మొత్తాన్ని ఇవ్వలేదని ఇలా ఎదురు దాడికి దిగిందంటూ చెప్తున్నారు.
ఈ విషయమై రహస్య మాట్లాడుతూ ముందునుకున్న ఎమౌంట్ ఇవ్వలేదు సరికదా..షూటింగ్ లో చాలా నీచంగా బిహేవ్ చేసారు. ఎలాగో కళ్ళు మూసుకుని ఆ పార్ట్ ఫినిష్ చేసాను.ఆ తర్వాత డబ్బు అడిగితే సెల్ తీయరు. ఇంటి దగ్గర ఉండి లేరన్నట్లు మా మేనేజరుకు చెప్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగాలి కదా అని మొదట కొందరంతే అని ఊరుకున్నా వారు డబ్బు విషయంలోనూ అన్యాయం చేయటంతో నాకు అసహ్యం వేసింది. ఇలాంటి సిట్యువేషన్ మరొకరుకి రాకూడదని కంప్లైంట్ చేసాను. నిర్మాతల మండలి కూడా పట్టించుకోకపోతే నేను వేరే విధంగా పోరాడతాను అంది. నాతో వ్యాపారం చేద్దామనుకునే వాళ్ళకు బుద్ది చెపుతాను అంటోంది.


Click it and Unblock the Notifications











