చంద్రముఖి 2 వచ్చేస్తోంది.. రజినీతో పాటు రెచ్చిపోయి నటించేందుకు రెడీ!

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో ఆడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఫ్లాపులో ఉన్న తలైవాను మళ్లీ నిలబెట్టింది చంద్రముఖి. అలాంటి చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ప్రకటించాడు. ఈ చిత్రం గురించి స్పందిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

తాను రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. చంద్రముఖి 2 సినిమాలో ఆయనతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారని, ఈ చిత్రం పీ వాసు దర్శకత్వంలో, సన్ పిక్ఛర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతుందని తెలిపాడు. అయితే ఇన్ని రోజులు వచ్చిన రూమర్లకు పుల్ స్టాప్ పడ్డట్టే.

 Raghava Lawrence About Chandramukhi Sequel

రజినీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆపై లోకేష్ కనకరాజ్‌తో ఓ చిత్రం చేయబోతోన్నాడని టాక్. అయితే రాఘవ లారెన్స్ కూడా రజినీని డైరెక్ట్ చేయాలని ఆశ పడుతున్నాడని, ఈ మేరకు రజినీకి కథ కూడా వినిపించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లారెన్స్ ప్రకటన మాత్రం ఈ వార్తలకు భిన్నంగా ఉంది. దర్శకత్వం కాకుండా రజినీ పక్కన నటిస్తున్నట్టు పేర్కొన్నాడు. మొత్తానికి లారెన్స్ ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X