మరో బిగ్ బడ్జెట్ మూవీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్.. మళ్ళీ భయపెడతాడా?
ఒక డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ తన డైరెక్షన్ స్కిల్స్ తో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా కనిపించాడు. ఇక ఇప్పుడు హిందీలో కూడా లక్ష్మీ బాంబ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమా కాంచన సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.
అసలు విషయంలోకి వస్తే లారెన్స్ నెవర్ బిఫోర్ అనేలా మరో డిఫరెంట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మూనీ సీక్వెల్స్ తో ఇన్నాళ్లు ఊహించని విధంగా బయపెట్టిస్తూనే నవ్వించిన లారెన్స్ నెక్స్ట్ మరో డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. కేవలం బయపెట్టడమే కాకుండా మంచి సందేశాలను ఇచ్చేలా సినిమాలను తేరకెక్కించే లారెన్స్ ఇప్పుడు కూడా అదే తరహాలో కొత్త కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా రుద్రన్ అనే తన కొత్త సినిమా పోస్టర్ ని విడుదల చేశాడు. చూస్తుంటే ఈ సారి మరో మ్యాజిక్ ఏదో క్రియేట్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. ఇక సినిమాకి రెహమాన్ మేనల్లుడు జీవి.ప్రకాష్ కుమార్ సంగీతం అంధించనున్నాడు. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను మిగతా భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని కుదిరితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. మరి లక్ష్మీ బాంబ్ సినిమా ఈ దీపావళికి ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











