twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చేసిన దానికి చాలా బాధపడ్డాను.. రాత్రంతా నిద్రపోలేదు.. లారెన్స్ ఎమోషనల్ పోస్ట్

    |

    నృత్య కళాకారుడిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. సామాజిక సందేశాలిచ్చే చిత్రాలు చేస్తూ.. చెప్పడం మాత్రం చేయడంలోనూ ముందుంటానని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు లారెన్స్.

    ఎందరికో ఆశ్రయం..

    ఎందరికో ఆశ్రయం..

    లారెన్స్ తాను తీసే సినిమాలు, చేసే పనులకు దగ్గరి సంబంధం ఉంటుంది. తాను నిజ జీవితంలో ఎలా ఆలోచిస్తాడో, ఎవరి గురించి పరితపిస్తాడో వాటినే తెరపై చూపిస్తాడు. అనాథ పిల్లలను చేరదీయడం, అందరికీ వైద్యం చేయించడం,ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం వంటివి చేస్తుంటాడు. తాజాగా కరోనా లాంటి కష్ట సమయంలో ముందుకు వచ్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు.

    భారీ విరాళం..

    కరోనాపై పోరాటంలో త‌న వంతు సాయంగా ఏకంగా 3 కోట్లు అందించాడు లారెన్స్. చంద్రముఖి 2 సినిమా కోసం తీసుకున్న మూడు కోట్లను విరాళంగా ఇచ్చేశాడు. అందులో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు.. ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 ల‌క్ష‌లు తన సొంతూరికి ఇచ్చేశాడు.

     వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

    వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

    మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించిన అనంతరం ఎంతో మంది తనకు ఫోన్ చేస్తున్నారని చెబుతూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు లారెన్స్. అందులో ఏం ఉందంటే.. ‘హాయ్ ఫ్రెండ్ అండ్ ఫ్యాన్స్.. నేను విరాళం ఇచ్చినందుకు నన్ను పొగుడుతున్న ఇండస్ట్రీ, మీడియా, ఫ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు చెప్పిన మాటలు విని నాకెంతో ఆనందం కలిగింది.

    ఈ విరాళం సరిపోదు..

    ఈ విరాళం సరిపోదు..

    విరాళం ఇచ్చిన తరువాత నాకెన్నో ఫోన్స్ వచ్చాయి.. ఫైటర్స్ , అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇంకా బయటి వ్యక్తులు కూడా తమకు సాయం చేయాల్సిందిగా అడుగుతున్నారు. అవి విన్నప్పుడు నా హృదయం బద్దలైంది. నా మూడు కోట్ల విరాళం వీటన్నంటికి కచ్చితంగా సరిపోదు. ఇక నేను ఇంతకంటే సాయం చేయలేనని, ఫోన్ చేసిన వారందరికీ నేను బిజీగా ఉన్నానని చెప్పామని నా అసిస్టెంట్లకు చెప్పాను. నిజాయితీగా ఇది చెబుతున్నాను.

    చాలా బాధ పడ్డాను..

    చాలా బాధ పడ్డాను..

    నా రూమ్‌కు వెళ్లి ఆలోచించాను.. నేను చేసిన దానికి చాలా బాధపడ్డాను.. జనాల ఏడుపుల గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పోలేకపోయాను.. చాలా లోతుగా ఆలోచించిన తరువాత ఓ ఐడియా వచ్చింది.. మనం ఈ లోకానికి వచ్చినప్పడు ఏమీ తేలేదు..పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లము..

     దేవుడు మనలోనే ఉంటాడు..

    దేవుడు మనలోనే ఉంటాడు..

    అన్ని దేవాలయాలు మూత పడ్డాయి. కష్టాల్లో ఉన్నవారి ఆకలిలోనే దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. దేవుడికి ఇస్తే అది ప్రజలకు చేరదని నా అభిప్రాయం.. కానీ ప్రజలకు ఇస్తే కచ్చితంగా ప్రజలకు చేరుతుంది. ఎందుకంటే దేవుడు మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. దేవుడు నన్ను ఇంట్లోనే కూర్చొబెట్టాడు.. కానీ ఇతరులకు సేవ చేసే బాధ్యతను కూడా ఇచ్చాడు.

    Recommended Video

    Janhvi Kapoor, Pooja Hegde are Heroines For NTR Trivikram Movie
    సేవ చేయడానికి సరైన సమయం..

    సేవ చేయడానికి సరైన సమయం..

    ఇప్పుడు మన ముందు ఉన్నది విపత్కర సమయం. సేవ చేయడానికి ఇదే సరైన సమయం. నా వరకు చేతనైనా సాయాన్ని ప్రజలకు , ప్రభుత్వానికి సేవ చేయాలని సిద్దమయ్యాను.. నా ఆడిటర్స్‌, నా సన్నిహితులతో చర్చించి.. మీ అందరి ఆశీర్వాదంతో ఏం చేయాలనుకుంటున్నది నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రకటిస్తాన'ని పోస్ట్ చేశాడు.

    English summary
    Raghava Lawrence Became Emotional After Donating 3 crores. He Wanst To Serve More. Because He Is Getting More Call To Drom various Setions Of people Who Are in Needy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X