twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొదటిది ఆవిడకే... వీడియో చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్!

    |

    సేవా కార్యక్రమాల్లో ముందుండే ప్రముఖ నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ఆ మధ్య కేరళ తుఫాను బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో గజ తుఫాన్ కారణంగా తీవ్ర నష్టం ఏర్పడిన నేపథ్యంలో లారెన్స్ తనవంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

    గజ తుపాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన 50 మందికి సొంత ఇళ్లు కట్టించబోతున్నట్లు ప్రకటించారు. అభిమానుల ద్వారా ఓ వృద్ధురాలు ఇల్లు కోల్పోయిన విషయం తెలుసుకున్న లారెన్స్ వెంటనే స్పదించారు. మొదటి ఇళ్లు ఆవిడకే కట్టించబోతున్నట్లు తెలిపారు.

    మొదటి ఇల్లు ఈవిడకే కట్టిస్తా

    గజ తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయిన ఈ అమ్మకు మొదటగా ఇల్లు కట్టిస్తానని లారెన్స్ స్పష్టం చేశారు. దాదాపు లక్ష ఖర్చుతో ఈ ఇల్లు కట్టించబోతున్నట్లు తెలుస్తోంది.

    వీళ్లకే ఆ బాధ్యత అప్పగిస్తున్నాను

    వీళ్లకే ఆ బాధ్యత అప్పగిస్తున్నాను

    ఈ అమ్మ గురించిన సమాచారం నాకు వీరి ద్వారానే తెలిసింది. ఆ ముసలావిడకు ఇల్లు కట్టించే పని కూడా వీరికే అప్పగిస్తున్నారు అని ఈ సందర్భంగా లారెన్స్ తెలిపారు.

    ఎవరికైనా సహాయం కావాలంటే నాకు తెలపండి

    ఎవరికైనా సహాయం కావాలంటే నాకు తెలపండి

    నిజంగా హెల్ప్ అవసరం ఉన్న ఇలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు సమాచారం అందించండి. వారి కష్టాలు కొంతవరరైనా తీర్చే ప్రయత్నం చేస్తాను. మీ అందరి మద్దతు నాకు కావాలి అని లారెన్స్ ట్వీట్ చేశారు.

    లారెన్స్‌పై ప్రశంసలు

    తుఫాన్ బాధితులుకు సహాయం చేయడానికి ముందు వచ్చి 50 ఇళ్లు కట్టిస్తానని ప్రకటించిన లారెన్స్ మీద అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

    English summary
    Raghava Lawrence has tweeted that he is ready to build 50 houses to the Gaja cyclone victims. Raghava Lawrence says each house would approximately cost Rs one lakh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X