అలా అయితేనే రజినీకాంత్ పార్టీలో ఉంటా.. తలైవాకు షాక్ ఇచ్చిన రాఘవ లారెన్స్..

రాఘవ లారెన్స్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. కేవలం సినిమాలతోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో లారెన్స్ జనాల మనసులను గెలుచుకున్నాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తరువాత దర్శకుడిగా హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాఘవ లారెన్స్ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ రాజకీయాల్లోకి కూడా రాబోతున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆయన పాలిటిక్స్ లోకి వస్తే..

ఆయన పాలిటిక్స్ లోకి వస్తే..

కొన్ని రోజుల క్రితం లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై చాలా క్లియర్ గా ఒక వివరణ కూడా ఇచ్చాడు. రజినీకాంత్ పార్టీ పెడితే అందులో తప్పకుండా జాయిన్ అవుతానని అన్నాడు. విమర్శలు చేసుకునే రాజకీయాలు తనకి వద్దని తలైవా లాంటి మంచి మనసున్న వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే తప్పకుండా జనాలకు మరింత సేవ చేయవచ్చని వివరణ ఇచ్చారు.

భవిష్యత్ రాజకోయల్లో భారీ మార్పులు

భవిష్యత్ రాజకోయల్లో భారీ మార్పులు

అంతా బాగానే ఉంది గాని ఇప్పుడు రజినీకాంత్ కి లారెన్స్ ఒక మెలిక పెట్టాడని అనిపిస్తోంది. గత రెండేళ్లుగా తలైవా పొలిటికల్ ఎంట్రీ పై అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. రజినీకాంత్ కూడా చాలా సార్లు స్పందించారు. తప్పకుండా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని భవిష్యత్ రాజకోయల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కూడా అన్నారు.

ఆ విషయంలో తలైవా మరోసారి ఆలోచించాల్సిందే..

ఆ విషయంలో తలైవా మరోసారి ఆలోచించాల్సిందే..

ముఖ్యంగా పార్టీ పెడితే తనకంటే అనుభవజ్ఞులైన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా సీఎం అభ్యర్థిగా నిలబెడతానని కూడా అప్పట్లో తలైవా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన లారెన్స్ ఆ విషయంలో మరోసారి రజినీకాంత్ ఆలోచించుకోని ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అభిమానుల కొరికే కూడా అదేనని అన్నాడు.

షాక్ ఇచ్చిన రాఘవ లారెన్స్

షాక్ ఇచ్చిన రాఘవ లారెన్స్

రజినీకాంత్ సీఎం అభ్యర్థిగా నిలబడితేనే తాను కూడా ఆయన బాటలో నడుస్తానని చెప్పిన లారెన్స్ వేరే వ్యక్తి వస్తే అందుకు తాను అంగీకరించబోనని సమాధానం ఇచ్చారు. ఇక యధావిధిగా ఎప్పటిలానే తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని రజినీకాంత్ తప్పకుండా అభిమానుల మనసుకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Recommended Video

Raghava Lawrence Says That His Children Recovered From Covid 19
నవంబర్ లో క్లారిటీ ఇవ్వనున్న సూపర్ స్టార్

నవంబర్ లో క్లారిటీ ఇవ్వనున్న సూపర్ స్టార్

ఇక రజినీకాంత్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఆయన ఇప్పటికే ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. ఫైనల్ గా నవంబర్ లో రజినీకాంత్ పాలిటిక్స్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X