twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది కేవలం ఆయన వల్లే సాధ్యమవుతంది.. రజినీ పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    దర్శకుడు, కొరియెగ్రఫర్, హీరో, నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎందరి అభిమానాన్నో సంపాదించుకున్నాడు. కోవిడ్ కారణంగా ఎంతో మంది రోడ్డుమీద పడితే ఆదుకున్నాడు. అవసరమైన వారికి చేతనైన సాయం చేసి అందరి హృదయాల్లో స్థానంపొందాడు. ఆ మధ్య లారెన్స్ రాజకీయాల్లోకి రావడంపై చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే వాటిపై వివరణ ఇస్తూ లారెన్స్ తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    ఆ ఒత్తిడి..

    ఆ ఒత్తిడి..


    ఈ రోజు మీ అందరికీ ఓ విషయాన్ని క్లారిటీగా చెబుదామని అనుకుంటున్నాను. సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను గత నెలలో ఓ పోస్ట్ చేశాను. అలా చెప్పడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. నేను చేసే సేవను చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్, ప్రజలు అందరూ అదే అంటున్నారు. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయొచ్చు అని అంటున్నారు. కోవిడ్ కారణంగా నేను చేసిన సేవా కార్యక్రమాలను చూశాక ఆ ఒత్తిడి ఎక్కువ అయింది అంటూ లారన్స్ చెప్పుకొచ్చాడు.

    అందరూ సాయం చేశారు..

    అందరూ సాయం చేశారు..


    ప్రతీ ఒక్కరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. నేను ఓ సాధారణ మనిషిని. నా సొంతింట్లోనే చిన్న పిల్లలను పెంచుకుంటూ సేవ చేయడం మొదలుపెట్టాను. నాకు ఏదైనా సాయం కావాలి అన్నప్పుడు రాజకీయా నాయకులందరూ ముందకు వచ్చారు. కరుణానిధి అయ్య, స్టాలిన్ సర్, జయలలిత అమ్మ, పళని సార్ ఇలా అందరూ సాయం చేశారు. అని లారెన్స్ పేర్కొన్నాడు.

    అది నచ్చదు..

    అది నచ్చదు..

    నాకు తెలుసు నేను సింగిల్‌గా ఇలా ఉన్నా సరే ఎక్కువగా సేవ చేయగలను. అయితే నేను రాజకీయాల్లోకి ఎందుకు రానని అనుకుంటున్నానో దానికి కారణాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తే మనం అందరి గురించి నెగెటివ్ మాట్లాడాల్సి వస్తుంది. ప్రత్యర్థులను తిట్టాల్సి వస్తుంది. కానీ అది నాకు నచ్చదు. నాకు అందరూ కావాల్సిన వారే అంటూ లారెన్స్ తెలిపాడు.

    అది కేవలం తలైవార్ వల్లే సాధ్యం..

    అది కేవలం తలైవార్ వల్లే సాధ్యం..


    అయితే ఎవరైనా నెగెటివిటీ అనేది లేకుండా పార్టీని ప్రారంభిస్తే నేను అందులో జాయిన్ అవుతాను. అయితే ఇండియాలో అలాంటి పార్టీని స్థాపించాలంటే అది కేవలం మా గురువు తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్ వల్లే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఎవ్వరినీ హర్ట్ చేయరు అని లారెన్స్ చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Raghava Lawrence Says That His Children Recovered From Covid 19
    ఏమీ ఆశించకుండా..

    ఏమీ ఆశించకుండా..

    ఒక వేళ ఆయన పార్టీని ప్రారంభించినా ప్రత్యర్థులపై ఆరోపణలు చేయరని నేను నమ్ముతున్నాను. ఇకవేళ ఆయన పార్టీ ప్రారంభిస్తే.. ఏమీ ఆశించకుండా నా వంతుగా అందులో పాలు పంచుకుంటాను. సర్విస్ ఈజ్ గాడ్.. నవంబర్ ?'అంటూ అందరిలోనూ ఓ ఆసక్తిని క్రియేట్ చేశాడు. నవంబర్‌లో రజినీ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందేమో అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Raghava lawrence Comments On Rajinikanth Political Entry. Today I want to clear something very important. Last month I posted saying, We can do service even without entering politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X