మరో మంచి పనితో నిజమైన హీరో అనిపించుకున్న రాఘవ లారెన్స్!
కరోనా వైరస్ కారణంగా ఎన్నో వేల కుటుంబాలు ఆకలితో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వారి ఆకలి బాధలను తీర్చేందుకు ప్రభుత్వాలతో పాటు సెలబ్రెటీలు కూడా వారికి తోచినంత సహాయం అందిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో చిన్నపాటి కార్మికులకు పని లేకపోతే గాని ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వారికోసం సినీ పెద్దలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

రాఘవ లారెన్స్ సహాయం..
ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం చేసే వారిలో ముందుటాడు రాఘవ లారెన్స్. తను సంపాధించిన దాంట్లో సగం వరకు సమాజసేవకే ఉపయోగిస్తుంటారు. లారెన్స్ అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇక ఇటీవల కరోనా కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల్లో సహాయం చేసేందుకు ఎదో ఒక విధంవా లారెన్స్ ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే మూడు కోట్లు..
ఇప్పటికే లారెన్స్ కరోనా రిలీఫ్ ఫండ్ అంటూ 3కోట్ల రూపాయలను డొనేట్ చేశాడు. ఓ విధంగా అక్కడ స్టార్ హీరోలతో పోలిస్తే లారెన్స్ చాలా ఎక్కువగా ఇచ్చాడనే చెప్పాలి. అంతటితో ఆపకుండా మధ్యమధ్యలో మరిన్ని మంచి పనుల్లో సాయం అందిస్తున్నాడు. ఇటీవల తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా 15లక్షల వరకు శానిటేషన్ వర్కర్స్ కోసం అందజేశారు.

మరో 25లక్షలు..
ఈ కష్టకాలంలో లారెన్స్ చేసిన మరో మంచి పనితో నిజమైన హీరోగా తమిళ సినీవర్గాలకు మరీంత దగ్గరయ్యాడు. తమిళ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కి 25లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తన డోనేషన్స్ కి అంతం లేదని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం తమిళనాడులో కూడా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. లారెన్స్ వీలైనంత వరకు రోజు ఎదో ఒక విదంగా జనాలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
Recommended Video

దర్శకుడిగా బిజీ..
కాంచన సిరీస్ లతో భయపెట్టి మంచి థ్రిల్లర్స్ ని అందించిన లారెన్స్ నెక్స్ట్ బాలీవుడ్ జనాలను కూడా బయపెట్టాలని అక్కడ అక్షయ్ కుమార్ తో కాంచన సినిమాను రీమేక్ చేస్తున్నాడు. అదే విధంగా హీరోగా కూడా అడుగులు వేస్తూ మధ్యమధ్యలో వేరే సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే లారెన్స్ చంద్రముఖీ సినిమాకు సీక్వెల్ రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











