twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతులకోసం లారెన్స్: మరోసారి తన హృదయం ఏమిటో చెప్పాడు

    తమిళనాడు వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న 271 మంది రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకునేందుకు నడుంబిగిస్తున్నాడు లారెన్స్.

    |

    టాలీవుడ్‌తో పోల్చుకుంటే.. కోలీవుడ్ స్టార్ సెలబ్రెటీలకు సమాజ సేవ కాస్త ఎక్కువనే చెప్పాలి. చెన్నై వరదలు వచ్చినప్పుడు.. యావత్ సినీప్రపంచం అంతా ఒక్కతాటిపై నిలిచి.. బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. లారెన్స్ సంపాదనలో దాదాపు గా సగభాగం సమాజం కోసమే ఖర్చు పెడుతుంటాడట. అలాగని తను చేసిన సాయం గురించి పెద్దగా ప్రచారం చేసుకోడు.

    ఆర్థిక స్తోమత లేక నయం కాని వ్యాధులతో జీవితంపై ఆశలు వదిలేసిన సుమారు 128మందికి మేజర్ సర్జరీస్ చేయించి.. వాళ్లకి కొత్త జీవితం ప్రసాదించాడట. రీసెంట్ గా కూడా ఓ పేద పిల్లాడికి సర్జరీ చేయించి.. అతని ప్రాణాలు నిలబెట్టాడట. కామన్ గా అయితే ఇలాంటి విషయాలు పెద్దగా ఎవరితో షేర్ చేసుకోడు... కాకపోతే ఈసారి ఆ పిల్లాడి బోసి నవ్వులు చూడాలనుకున్నాడో ఏమో కానీ.. సోషల్ మీడియాలో తల్లీబిడ్డల ఫోటో పోస్ట్ చేశాడు. దీంతో లారెన్స్ సీక్రెట్ గా చేస్తున్న సోషల్ సర్వీస్ వెలుగులోకి వచ్చింది...

    Raghava Lawrence to help farmers

    ఇప్పటికే ఓ రైతు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం కూడా చేశాడు. అలాగే, తమిళనాడు వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న 271 మంది రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకునేందుకు నడుంబిగిస్తున్నాడు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబం లారెన్స్‌ని ఆశ్రయించగా, వారి ఆవేదనను విని వెంటనే రూ.3 లక్షలు ఇచ్చాడట.

    అలాగే, తమిళనాడులో ఇప్పటివరకు 271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకు విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి దాని ద్వారా వచ్చిన నిధిని ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలుగా ఇవ్వాలని భావిస్తున్నాడట.... హ్యాట్సాఫ్ లారెన్స్

    English summary
    Raghava Lawrence Who Fight for Jallikattu is now turned to Help Farmers of Tamilanadu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X