కేసు నమోదు చేసేందుకు బయలుదేరిన హిజ్రాలు.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా!

Recommended Video

Raghava Lawrence Once Again Responds On Seeman Issue|| Filmibeat Telugu

డాన్స్ కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా రాఘవ లారెన్స్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. లారెన్స్ వివాదాలకు దూరంగా ఉంటాడు. పలు సేవ కార్యక్రమాలతో లారెన్స్ తన పెద్ద మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాంచన 3. ఇటీవల విడుదలైన కాంచన 3 ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత కొన్ని రోజులుగా నాన్ తమిళర్ కట్చి' పార్టీ చీఫ్ కన్వీనర్ అయిన సీమాన్, లారెన్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. సీమాన్ పలు సందర్భాల్లో లారెన్స్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు. అతడి విమర్శలకు లారెన్స్ కూడా సమాధానం ఇచ్చాడు అయినా ఈ వివాదం ఆగడం లేదు.

కాంచన తర్వాత

కాంచన తర్వాత

లారెన్స్ డాన్సులకు, నటనకు సౌత్ లో అభిమానులు ఉన్నారు. లారెన్స్ చేస్తున్న సేవాకార్యక్రమాలతో దివ్యాంగులు కూడా అతడిని అభిమానిస్తారు. ఇక కాంచన చిత్రం తర్వాత హిజ్రాలు కూడా లారెన్స్ కు ఫాన్స్ గా మారిపోయారు. సౌత్ లో కాంచన సిరీస్ కు విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. కాంచన 3 చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచిన్నప్పటికీ వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఇదిలా ఉండగా లారెన్స్, నాన్ తమిళర్ కట్చి' పార్టీ చీఫ్ కన్వీనర్ అయిన సీమాన్ మధ్య వివాదం రోజు రోజూకుగా హాట్ టాపిక్ గా మారుతోంది.

లారెన్స్ కోసం

లారెన్స్ కోసం

లారెన్స్ పై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న సీమాన్ కు బుద్ది చెప్పడానికి లారెన్స్ అభిమానులు సిద్ధం అయ్యారు. సీమాన్ పై కేసు నమోదు చేసేందుకు పేద ఎత్తున హిజ్రాలు, దివ్యాంగులు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యలయానికి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. లారెన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక అతడి అభిమానులుగా ఉన్న దివ్యాంగులు, హిజ్రాలపై నాన్ తమిళర్ కట్చి పార్టీ కార్యకర్తలు దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

సహనం పాటించండి

సహనం పాటించండి

ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా లారెన్స్ మాత్రం సహనం కోల్పోవడం లేదు. తన అభిమానులు కూడా సహనం పాటించాలని లారెన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ప్రశంసలు లభిస్తున్నాయి. నా తరుపున హిజ్రాలు, దివ్యాంగులు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కొందరిపై కేసు నమోదు చేయడానికి సిద్దమైనట్లు తెలిసింది. దయచేసి అలాంటి పని చేయవద్దు. మనం మంచినే కోరుకుందాం. నాపై విమర్శలు చేస్తున్న వారిని వారి ఇష్టానికే వదిలేయండి అని లారెన్స్ ఓ ప్రకటనలో తెలిపాడు.

చిన్న సమస్య అని తెలియగానే

చిన్న సమస్య అని తెలియగానే

నాకు చిన్న సమస్య వచ్చిందని తెలియగానే అండగా నిలబడేందుకు మీరంతా పరిగెత్తుకుని వచ్చారు. ఆ అభిమానం చాలు. మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రస్తుతం నేను కాంచన హిందీ చిత్ర రీమేక్ లో బిజీగా ఉన్నా. షూటింగ్ పూర్తి కాగానే ఈ వివాదంపై ఓ నిర్ణయం తీసుకుంటా. భగవంతుడు మనకి మంచే చేస్తాడు. మనకు చెడు చేయాలని భావించే వారికి కూడా మంచి జరగాలని దేవుడిని ప్రార్థిద్దాం అని లారెన్స్ పేర్కొన్నాడు. గతంలో సీమాన్ విమర్శలపై స్పందించిన లారెన్స్.. నాకు రాజకీయాలు తెలియవు.. దయచేసి నేర్చుకునేలా చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X