twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మదర్ థెరిసా అవార్డ్ అందుకున్న రాఘవ లారెన్స్

    |

    కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలు పెట్టి నటుడిగా తన సత్తా చాటడంతో పాటు దర్శకుడిగా కూడా తన ప్రతిభ నిరూపించుకున్న రాఘవ లారెన్స్... సేవా గుణంలోనూ తాను ఏ మాత్రం తీసిపోనని ప్రూవ్ చేసుకున్నారు. సేవా గుణంలో తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని.. మదర్ థెరిస్సా 108వ జయంతి సందర్భంగా అవార్డుతో సత్కరించారు.

    ఈ విషయాన్ని లారెన్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డు అందుకోవడాన్ని గొప్పగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    చెన్నై, తేరనాపేటలోని కామరాజర్‌ ఆవరణలో జరిగిన ఈ అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారెన్స్‌ను పలువురు అభినందించారు.

    Raghava Lawrence received Mother Teresa award

    తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాఘవ లారెన్స్ కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 150 కి పైగా చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. అనాధ పిల్లలకు తన శక్తిమేర సహాయం అందిస్తున్నారు. ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో రూ. కోటి విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

    English summary
    "I received “Mother Teresa award” on Mother Teresa’s 108th birthday yesterday. I’m extremely Happy and Grateful, I thank Mother Teresa’s Missionaries of Charity and Mr. Dhas, managing trustee for this Prestigious Award." Raghava Lawrence tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X