twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పిల్లలు కరోనా నుంచి కోలుకున్నారు.. తన సేవే వారిని కాపాడిందన్న లారెన్స్

    |

    కరోనా వైరస్ విజృంభించిన సమయంలో మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చంద్రముఖి 2 సినిమాలో ఛాన్స్ వచ్చిందని, ఆ నిర్మాత ఇచ్చిన రెమ్యూనరేష్ మొత్తాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయాన్ని అందజేశాడు. ప్రస్తుతం లారెన్స్ ఆనందంలో మునిగతేలుతున్నాడు. అతని అనాథాశ్రమంలోని పిల్లలు కరోనా నుంచి కోలుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

    Recommended Video

    Raghava Lawrence Says That His Children Recovered From Covid 19
    మూడు కోట్ల విరాళం

    మూడు కోట్ల విరాళం

    ప్రభుత్వానికి అండగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు లారెన్స్. అంతేకాకుండా సినీ కార్మికులకు, వికలాంగులకు, వృద్దులకు, తాను పుట్టిన గ్రామానికి ఇలా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. మూడు కోట్లు విరాళం ఇచ్చాక కూడా తన మనసు తృప్తి చెందడం లేదని ఎంతో వేదనకు గురయ్యాడు.

    ఎన్నో సేవా కార్యక్రమాలు..

    ఎన్నో సేవా కార్యక్రమాలు..

    మానవ సేవే మాధవ సేవ అన్నట్టు.. సేవ చేయడానికి ఇదే సమయమని లారెన్స్ పిలుపునిచ్చాడు. అందర్నీ ఆదుకోవడం తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదని, అందరూ సాయం చేయాలని కోరాడు. ఎవరైనా సాయం చేయాలనుకునేవారు తనకు విరాళాలు పంపండని కోరాడు. ఈ మేరకు ఎంతో మంది ఆకలిని తీర్చాడు.

    కరోనా బారిన..

    కరోనా బారిన..

    లారెన్స్‌ అనేక అనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లారెన్స్ అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు. ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

    నా సేవే నా పిల్లలని..

    నా సేవే నా పిల్లలని..

    ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెబుతూ.. ‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌గారికి, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం' అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Raghava Lawrence Says that His children Recovered From Corona. Earlier he says that In His orphan Home Some Children Got Corona Postive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X