twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా ఆయనే చూసుకొంటాడు.. హిందూ దేవుళ్లను కించపరుస్తూ వీడియో.. లారెన్స్ రాఘవ ఫైర్

    |

    హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కరుప్పర్ కూట్టమ్ అనే సంస్థ వీడియోలను రిలీజ్ చేసిన ఘటన తమిళనాడులో వివాదంగా మారింది. హిందూ దేవతలపై విషం చిమ్ముతూ, వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు పెను దుమారంగా మారాయి. కరుప్పర్ కూట్టమ్ తీరుపై పలు సంస్థలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లారెన్స్ రాఘవ, ఇతర సినీ ప్రముఖులు స్పందిస్తూ..

     కరుప్పర్ కూట్టమ్ వివాదంపై లారెన్స్

    కరుప్పర్ కూట్టమ్ వివాదంపై లారెన్స్

    కరుప్పర్ కూట్టమ్ సృష్టించిన వివాదంపై దర్శకుడు లారెన్స్ రాఘవ ఘాటుగా స్పందించారు. కరుప్పర్ కూట్టమ్ సంస్థ పేరు చెప్పకుండా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఆ సంస్థ తీరు చాలా దారుణం. ఆ సంస్థ పేరు చెప్పి వారికి పబ్లిసిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వారికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు అని అనుకొన్నాను అని లారెన్స్ అన్నారు.

    నా తల్లి అలా నేర్పింది..

    నా తల్లి అలా నేర్పింది..

    ఇలాంటి వివాద సమయంలో మురుగన్ భక్తులకు ఒకటే చెప్పాలనుకొన్నాను. చిన్నప్పటి నుంచి నాకు నా తల్లి కంధ శాస్తి కవసమ్ వింటూ పెరిగాను. దానికి ఉన్న శక్తి నాకు అండగా నిలుస్తున్నది. నా ఇంటో ప్రతిష్టించిన మురుగన్ విగ్రహానికి రోజూ పూజచేస్తాను. ఇదంతా ఎందుకు చెబతున్నానంటే.. మురుగన్‌పై కొందరు అనుచితంగా వీడియోలు చేయడం బాధకలిగించింది అని అన్నారు

    మురుగన్ శక్తి ఏమిటో తెలుస్తుంది

    మురుగన్ శక్తి ఏమిటో తెలుస్తుంది

    మురుగన్‌ దేవుడిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారి పేరును ప్రస్తావించి వారిని, వారి పేరును పబ్లిసిటీ ఇవ్వదలచుకోలేదు. మురుగన్ శక్తి ఏమిటో సమయమే తెలియజేస్తుంది. అప్పటి వరకు ఆయన భక్తులు సహనంతో ఉండాలి. సమయమే వారికి గుణపాఠం చెబుతుందని బలంగా నమ్ముతున్నాను అని లారెన్స్ రాఘవ ఆవేదన వ్యక్తం చేశారు.

    తమిళ సినీ ప్రముఖులు స్పందన

    తమిళ సినీ ప్రముఖులు స్పందన

    కరుప్పర్ కూట్టమ్ వివాదంపై తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు గౌరవ్ కూడా ఓ వీడియోను రిలీజ్ చేశారు. రాఘవ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తున్నది. ఈ వివాదంపై స్పందించడంపై అభినందిస్తూ సందేశాలు పంపిస్తున్నారు.

    Recommended Video

    Raghava Lawrence Says That His Children Recovered From Covid 19
     సంస్థ ప్రతినిధి అరెస్ట్.. వీడియోల తొలగింపు

    సంస్థ ప్రతినిధి అరెస్ట్.. వీడియోల తొలగింపు

    మురుగన్ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోను ప్రసారం చేసిన యూట్యూబ్ చానెల్‌ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు చేసిన ఫిర్యాదుపై స్పందించిన చెన్నై పోలీసులు ఈ వివాదంపై విచారణ చేపట్టారు. యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొంటామని పోలీసులు పేర్కొన్నారు.

    English summary
    Raghava Lawrence reacts on derogatory remarks against Hindu deity Murugan by Karuppar Koottam organisation in Tamil Nadu. Raghava wrote that, Let's not talk about anyone and make them big. See the beauty, love and power of murugan in this picture, Everything else will fade away. Time will answer everything.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X