Chandramukhi 2 ఐదుగురు హాట్ హీరోయిన్లతో లారెన్స్ రొమాన్స్.. మరి రజనీకాంత్ సంగతి ఏమిటంటే?
ఒకప్పుడు ఇంటిల్లిపాదినీ అలరించిన చంద్రముఖి సినిమా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో జ్యోతిక ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

చంద్రముఖి 2
డైరెక్టర్ పి వాసు లైకా ప్రొడక్షన్స్ తో కలిసి చంద్రముఖి అనే సైకలాజికల్ హారర్ మూవీకి సీక్వెల్ చేస్తున్నారు. చంద్రముఖి 2 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ నటించిన ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదటి భాగంలో నటించి మంచి పేరు సంపాదించిన వడివేలు కూడా రెండో భాగంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మైసూర్ లో జూలై 15వ తారీఖు నుంచి జరుగుతోంది.

ఐదుగురు హీరోయిన్లు
ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా రవి మరియా అనే నటుడు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ హీరోయిన్ పాత్రలో నటిస్తారంటూ ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. అదేమిటంటే ఈ సినిమాలో కేవలం ఒక హీరోయిన్ ఉండదని ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది.

షూటింగ్లో కూడా
అంతేకాక వారి పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి ఈ సినిమాలో రాఘవా లారెన్స్ తో పాటు లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, మంజిమా మోహన్, సృష్టి దంగే, సుభిక్ష కృష్ణన్ అనే భామలు నటించబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరందరూ కూడా ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

కీరవాణి సంగీతం
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సమయంలో నటి సుభిక్ష కృష్ణన్ కూడా పాల్గొన్నారు. అయితే అప్పుడు ఆమె హీరోయిన్గా నటిస్తారని ప్రచారం మాత్రం జరగలేదు. కానీ ఇప్పుడు ఆమె కూడా హీరోయిన్గా భాగమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సౌత్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఆర్డీ రాజశేఖర్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి.

ఆసక్తికరంగా
హారర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంచన సిరీస్ తో రాఘవ లారెన్స్ హారర్ జానర్ లో మంచి పట్టు సంపాదించాడు మరి చంద్రముఖి లాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన అదే దర్శకుడు దాని సీక్వెల్ తెరకెక్కిస్తూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











