twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో హీరో పొలిటికల్ ఎంట్రీ!? ప్రేస్ మీట్ లో ఇలా అనౌన్స్ చేసాడు

    నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ కూడా రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు.

    |

    నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ కూడా రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని... కానీ, తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగితే పార్టీని స్థాపించడం ఖాయమని చెప్పారు.

    రాఘవ లారెన్స్‌ జల్లికట్టు పోరాటంలో విద్యార్థులకు మద్దతుగా నిలిచి పోరాటంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల్లో పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ, పార్టీని స్థాపించాలనే ఆలోచన ఆయన మదిలో గట్టిగా ఉందనే విషయం మాత్రం అర్థమవుతోంది.

     సామాజిక బాధ్యత ఎక్కువ:

    సామాజిక బాధ్యత ఎక్కువ:


    రాజకీయాలపై ఆసక్తి లేదు. కానీ, సామాజిక బాధ్యత ఎక్కువ. సేవా కార్యక్రమాలు చేసేది అందుకే. జల్లికట్టు విషయంలో స్పందించింది మనిషిగా మాత్రమే. తమిళ సంప్రదాయాల కోసం నా వంతుగా కృషి చేశాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయం కాదు..'అని చెప్పిన లారెన్స్ మళ్ళీ అవసరమైతే రాజకీయ పార్టీ స్థాపిస్తా అంటం ఏమిటో కస్త తికమక గానే అనిపిస్తోంది.

     రాజకీయాల్లోకి :

    రాజకీయాల్లోకి :


    నాలుగైదు రోజుల క్రితమే, 'రాజకీయాలు నాకు సరిపడవు..' అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన లారెస్స్‌, అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటంలో, సినీ రంగం నుంచి లారెన్స్‌ పేరు ప్రముఖంగా విన్పించిన విషయం విదితమే. ప్రత్యక్షంగా జల్లికట్టు ఆందోళనల్లో పాల్గొన్నాడు లారెన్స్‌.

     జల్టికట్టు ఉద్యమం:

    జల్టికట్టు ఉద్యమం:


    మూడురోజుల క్రితమే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన లారెన్స్ జల్టికట్టు ఉద్యమం ఉధృతమవుతున్న తరుణంలో, ఉద్యమంలోకి అసాంఘీక శక్తులు ప్రవేశించినమాట వాస్తవమనీ, ఉద్యమానికి నాయకత్వ లోపం కారణంగానే జరిగి వుండొచ్చనీ, తనవరకు తాను జల్లికట్ట కోసం చిత్తశుద్ధితో పోరాడానని,

     వివాదాల్లోకి లాగొద్దని:

    వివాదాల్లోకి లాగొద్దని:


    ప్రస్తుతానికైతే తన ఫోకస్‌ పూర్తిగా సినిమాల మీదనే వుందనీ, అనవసరంగా తనను రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని చెప్పాడు. కానీ అంతలోనే మళ్ళీ ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవటం పై అంతా సక్తిగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రిని కలిసి న లారెన్స్

     విలేకరుల సమావేశం:

    విలేకరుల సమావేశం:


    విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జల్లికట్టు విజయోత్సవాన్ని నిర్వహించాలని ఆయన మూడు కోరికలను వ్యక్తం చేశారు. కాగా మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జల్లికట్టులో పాల్గొన్న యువకులతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు.

     కోరిన కోరికలకు:

    కోరిన కోరికలకు:


    ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిని కోరిన కోరికలకు ఆయన పాజిటివ్‌గా స్పందించారని తెలిపారు. తాను సామాజిక సేవలో ఇప్పటి వరకు 135 మంది పేదలకు ఉచిత శస్త్ర చికిత్స అందించానని, 200ల మందికి పైగా ఆర్థికసాయంతో పాటు విద్యాసాయం చేస్తున్నానన్నారు. అలాగే 60 మంది అనాథలకు తన ఆశ్రమంలో సంరక్షణా బాధ్యతలను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు.

     భవిష్యత్తులో రాజకీయపార్టీ:

    భవిష్యత్తులో రాజకీయపార్టీ:


    కాగా తనకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని అయితే తనను నమ్ముకున్న వారికి అభద్రతా భావం కలిగితే భవిష్యత్తులో రాజకీయపార్టీని నెలకొల్పడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాగా తన ఇయక్కంలో ఏ పార్టీకి చెందని వారికి అవకాశం వుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు పోరాటంలో మృతి చెందిన మణికంఠన్‌ అనే యువకుడి కుటుంబానికి రూ.10 లక్షలు విరాళాన్ని అందించనున్నట్లు తెలిపారు.

    English summary
    In the near future, multi-talented actor Raghava Lawrence might be one amongsuccessful actors cum politicians of Tamilanadu. Lawrence declared that if he enters politics and contests in elections. all the candidates of his party will be youngsters only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X