మీకివే నా అంతిమ నివాళులు...ఎఆర్ రహమాన్
ఆదివారం సాయింత్రం మరణించిన సౌత్ ఇండియా పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ మలేషియన్ వాసుదేవన్(66) కి ప్రముఖ సంగీత దర్శకులు ఎ.ఆర్.రహమాన్ నివాళులు అర్పించారు. రహమాన్ తన ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని ప్రస్దావిస్తూ..మలేషియన్ వాసుదేవన్ సర్..మీరు నిర్మించిన డిస్కో డిస్కో(1987) ఆల్బమ్ ద్వారా నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చి నిలబెట్టిన గొప్ప వ్యక్తులలో మీరు ఒకరు. మీకు ఇవే నా అంతిమ నివాళులు అని ట్వీట్ చేసారు. ఇక వాసుదేవన్..డయాబెటిక్ కోమాలోకి వెళ్ళి కొద్దిరోజులుగా ఆయన చెన్నైలోని వడపళని హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన తమిళంలో ఎనిమిదివేలపాటలకు పైగా పాడారు. ఆయన గళం హిందీ, మళయాళం, తెలుగు లలో సైతం పాపులర్ కావటం విశేషం.
ఎఆర్ రహమాన్ డిస్కో డిస్కో మహేషియన్ వాసుదేవన్ వడపళని ar rahman disco disco malaysia vasudevan vadapalani


Click it and Unblock the Notifications