కలెక్షన్స్: పవన్‌తో పాటు జోరుమీదున్న నయనతార!

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' తెలుగునాట కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కలెక్షన్ల పరంగా నెం.1 స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలోనే ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. మరో వైపు తమిళనాట నయనతార నటించిన 'రాజారాణి' సినిమా కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. విశేషం ఏమిటంటే...ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి.

చాలా కాలం తర్వాత నయనతార తమిళంలో ఆర్యతో కలిసి 'రాజా రాణి' చిత్రంలో నటించింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదలైన ఈచిత్రం తమిళనాడులో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్లు అందిరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. తమిళనాడు బాక్సాఫీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం 25 రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న కలెక్షన్లు పరిశీలిస్తే....2013 సంవత్సరంలో గ్రాస్ కలెక్షన్ల విషయంలో 3వ స్థానంలో నిలిచినట్లు స్పష్టం అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈచిత్రం ఇంత పెద్ద హిట్ కావడంతో యూనిట్ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మరో వైపు ఈ చిత్రం తొలి వారాంతంలో రూ. 12.2 కోట్లు వసూలు భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. ఇంతే కాకుండా ఓవర్సీస్ వసూళ్ల విషయంలో అదరగొడుతోంది. ఓపెనింగ్ వీకెండ్ లో ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద 800,000 USD వసూలు చేసింది.

ప్రశంసలు

ప్రశంసలు


రాజారాణి చిత్రానికి పరిశ్రమ పెద్దలు, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమాను ఎంతో వినోదాత్మకంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసారని అంటున్నారంతా.

ఎవరెవరు..

ఎవరెవరు..


ప్రముఖ దర్శకుడు శంకర్, లింగుస్వామి, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ తదితరులు సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

ముంబై ఫిల్మ్ ఫెస్ట్ లో....

ముంబై ఫిల్మ్ ఫెస్ట్ లో....


రాజారాణి చిత్రం ప్రస్తుతం జరుగుతున్న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితం కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.

అక్టోబర్ 24న

అక్టోబర్ 24న


ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో అక్టోబర్ 24న రాజారాణి చిత్రం ప్రదర్శించనున్నారు. రాత్రి 8.30 గంటలకు సినిమామాక్స్ వెర్సోవా ఈ చిత్ర ప్రదర్శనకు వేదిక కానుంది.

రాజారాణి

రాజారాణి


రాజా రాణి చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి ఈచిత్రానికి క్లీన్ U సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా భారీగా ఈసిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్


ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ...ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో మంచి వినోదం ఉండటంతో కలెక్షన్లు జోరు కొనసాగుతోంది. ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రాజా రాణి' చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X