నయన లవ్ ఫెయిల్యూర్‌ను ఇలా వాడుకుంటున్నారు!
హైదరాబాద్ : నయనతార, ప్రభుదేవా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలడంతో పాటు కొంత కాలం సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి నయనతో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ఏమైందో ఏమో తెలియదు కానీ...మరికొన్ని రోజుల్లో పెళ్లి అనే సమయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు.
ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయిన నయనతార తమిళ హీరో ఆర్యతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు ఎప్పటి నుంచో ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్య వీరు పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు కూడా మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఇదంతా ఈ ఇద్దరు జంటగా నటిస్తున్న 'రాజా రాణి' అనే తమిళ సినిమా పబ్లిసిటీ కోసమే అనే ఆ తర్వాత తేలింది.

తాజాగా 'రాజా రాణి' టీజర్ ఒకటి విడుదల చేసారు. ఈ టీజర్లో.....'ప్రేమ వైఫల్యం తర్వాత జీవితం ఉంది', 'ప్రేమ వైఫల్యం తర్వాత ప్రేమ ఉంది' అనే క్యాప్షన్‌ను తగిలించారు. దీన్ని బట్టి రియల్ లైఫ్‌లో నయనతార లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని రీల్ లైఫ్‌కు ముడి పెట్టి సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నారన్నామాట. మొత్తానికి నయనతార లవ్ ఫెయిల్యూర్ మ్యాటరును ఇలా వాడుకుంటున్నారు.
'రాజారాణి' చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జై, సంతానం, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ నెలలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులోనూ దీన్ని అనువదించి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (వీడియో టీజర్‌ను క్రింద వీక్షించండి).
<center><center><center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/g-m4q-yKTKk" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center>


Click it and Unblock the Notifications











