For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యూట్యూబ్‌లో నయనతార రికార్డ్

  By Srikanya
  |

  చెన్నై : ఇప్పుడు సినిమావారి లెక్కలు యూ ట్యూబ్ లలో ఉంటున్నాయి. తాజాగా నయనతార నటించిన చిత్రం కూడా యూ ట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసి వార్తల్లో నిలించింది. శంకర్‌ సహాయ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాజారాణి'. ఇందులో ఆర్య, నయనతార జంట కట్టారు. ఐదు రోజుల్లోనే ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రెండు లక్షల మంది చూశారు.

  దర్శకుడు మాట్లాడుతూ.. '' శృంగార ప్రేమ కథా చిత్రం ఇది. యువతకు వందశాతం వినోదం పంచుతుందనడంలో సందేహం లేదు. రెండు లక్షల హిట్లు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్య, నయనతార మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయ''ని చెప్పారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ఆడియో విడుదలైంది. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. జై, నశ్రియ కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  ఇటీవల నయనతార, ఆర్యకు పెళ్లంటూ వదంతులకు కారణమైన చిత్రం 'రాజా రాణి'. సినిమాకు సంబంధించిన తొలి పోస్టరు విడుదలైనప్పుడు వారు వివాహం చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఆడియో విడుదల చెన్నైలో ఘనంగా జరిగింది. నగరంలోని సత్యం థియేటర్‌ వేదికైంది. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌, ఏఆర్‌ మురుగదాస్‌ ప్రొడక్షన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సత్యరాజ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. మంచి యూత్‌ఫుల్‌ కథ. వినోదానికి కొదువుండదు. జీవీ ప్రకాశ్‌ సంగీతం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. సత్యరాజ్‌ ప్రసంగిస్తూ.. అట్లీని చూస్తే ఆశ్చర్యమేస్తోంది.చిన్న వయసులోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకుంటాడనిచెప్పారు.

  ఇక ప్రభుదేవాతో ప్రేమ పెటాకులయ్యాక ఇకపై ప్రేమజోలికే వెళ్లదనుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆర్య ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. 'బాస్ ఎన్గిర భాస్కరన్' తెలుగులో 'నేనే అంబానీ' చిత్రం నుంచి వీరిద్దమధ్య ఏదో నడుస్తుందని పరిశ్రమ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటూ కొట్టిపారేస్తోంది నయనతార. ఆర్య కూడా అలాగే అంటున్నాడు.

  ''మిగతా హీరోయిన్లలాగే నాకు నయనతార మంచి స్నేహితురాలు మాత్రమే. మాపై వస్తున్నవి ఒట్టి పుకార్లు మాత్రమే. వాటిని ఎవరూ నమ్మరు''అంటూ చెప్పుకొచ్చాడు ఆర్య. ''నాకు ఆర్య జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఇప్పటికే నేను జీవితంలో చాలా బాధలు అనుభవించాను. ఇక భరించలేను. ప్రేమా, గీమా జాన్తానై. నా దృష్టి అంతా ప్రస్తుతం కెరీర్‌పైనే. ఎవ్వరేమనుకున్నా, ఎన్ననుకున్నా నేను ఏ మాత్రం పట్టించుకోను. ఇప్పుడు టాలీవుడ్‌లో నాకు మళ్లీ మంచి అవకాశాలు వస్తున్నాయి. వీటిని చూసి ఓర్వలేకనే నాపై నిందలు మోపుతున్నారు. వీటి గురించి ఆలోచిస్తూ నా కెరీర్ పాడుచేసుకునే స్థితిలో ప్రస్తుతం నేను లేను''అంటూ చెప్పుకొచ్చింది.

  English summary
  Raja Rani is trending on the home page of Youtube in India and creating records. The innovative promotional campaign, set the ball rolling for Raja Rani's teaser promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X